క్రీడాభూమి

అశ్విన్ సూపర్ ఫీట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 19: ఆల్‌రౌండర్‌గా తనను తాను నిరూపించుకుంటున్న భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి, ఐదో టెస్టు మ్యాచ్, నాలుగో రోజు ఆటలో అరుదైన మైలురాయిని చేరాడు. 149 బంతులు ఎదుర్కొని 67 పరుగులు చేసిన అతను ఈ సిరీస్‌లో 250 పరుగులు మైలురాయిని అధిగమించాడు. ఒకే సిరీస్‌లో కనీసం 25 వికెట్లు పడగొట్టి, 250కిపైగా పరుగులు చేసిన అరుదైన ఆటగాళ్ల సరసన స్థానం సంపాదించాడు. చివరిసారి ఈ ఫీట్‌ను 1985లో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో నమోదు చేశాడు. అతను 250కి పైగా పరుగులు చేసి, 31 వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాత ఈ అరుదైన మైలురాయిని చేరిన ఆటగాడిగా అశ్విన్ గుర్తింపు పొందాడు. ఈ సిరీస్‌లో బోథమ్ కామెంటేటర్‌గా సేవలు అందింస్తుండడం విశేషం.