క్రీడాభూమి

కొత్త అధ్యాయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కరుణ్ నాయర్ భారత టెస్టు క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. వీరేందర్ సెవాగ్ రెండు పర్యాయాలు ఈ ఫీట్ సాధించాడు. 2004 మార్చి 28న పాకిస్తాన్‌తో ముల్తాన్ టెస్టు ఆడుతూ అతను 309 పరుగులు సాధించాడు. సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత, 2008లో అదే రోజున, చెన్నైలో దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశాడు. కాగా, తాజా సిరీస్‌లో నాయర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో రాణించాడు. మొహాలీలో ఇంగ్లాండ్‌తో భారత్ ఆడిన మూడో టెస్టులో నాయర్ అరంగేట్రం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులు చేసి రనౌటయ్యాడు. టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించగా, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం నాయర్‌కు దక్కలేదు. కెరీర్‌లో రెండో టెస్టు ముంబయిలో ఆడిన అతను 13 పరుగులు చేసి మోయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. ఆ టెస్టును భారత్ ఇన్నింగ్స్ 36 పరుగుల భారీ తేడాతో సొంతం చేసుకుంది. తాజా టెస్టు నాయర్‌కు మూడో టెస్టుకాగా, మూడో ఇన్నింగ్స్ ఆడాడు. అద్వితీయ ప్రతిభ కనబరచి, టీమిండియాలో స్థిరమైన స్థానం సంపాదించే సత్తా తనకు ఉందని నిరూపించాడు.
* ప్రపంచ టెస్టు క్రికెట్‌లో ఒక బ్యాట్స్‌మన్ తన తొలి సెంచరీని పూర్తి చేసి, అదే జోరును కొనసాగిస్తూ ట్రిపుల్ సెంచరీ సాధించడం ఇది మూడోసారి. వెస్టిండీస్ ‘లెజెండరీ క్రికెటర్’ గారీ సోబర్స్ పాకిస్తాన్‌పై 1958 మార్చిలో కింగ్‌స్టన్‌లో జరిగిన టెస్టులో తన మొదటి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. అనంతరం దానినే ట్రిపుల్ సెంచరీగా మలచి, 365 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 614 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 38 ఫోర్లు ఉన్నాయి. కాగా, ఆస్ట్రేలియా స్టార్ బాబ్ సింప్సన్ 1964 జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో 743 బంతులు ఎదుర్కొని, 23 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 311 పరుగులు సాధించాడు. కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మార్చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. ఇప్పుడు కరుణ్ నాయర్ అదే ఫీట్ సాధించాడు. ఇంగ్లాండ్‌తో చెన్నైలో జరుగుతున్న టెస్టులో అతను 381 బంతులు ఎదుర్కొని, 32 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 303 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
* ఆడిన ఇన్నింగ్స్ సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే, ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా కరుణ్ నాయర్ కొత్త రికార్డు నెలకొల్పాడు. అతను తాను ఆడుతున్న మూడో ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను సాధించాడు. తొలి ట్రిపుల్ సెంచరీని నమోదు చేయడానికి లెన్ హట్టన్ (ఇంగ్లాండ్) తన 9వ ఇన్నింగ్స్‌లో ట్రిపుల్ సెంచరీ చేశాడు. సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా)తోపాటు జాన్ ఎడ్రిచ్ (ఇంగ్లాండ్) తమ 13వ ఇన్నింగ్స్‌లో ట్రిపుల్ సెంచరీలు చేశారు.
*ఐదు లేదా అంతకంటే ఎక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో కరుణ్ నాయర్ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అతను 303 పరుగులతో నాటౌట్‌గా నిలవడం ద్వారా, 2015 ఫిబ్రవరిలో, చెన్నైలోనే ఆస్ట్రేలియాపై మహేంద్ర సింగ్ ధోనీ 224 పరుగులతో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అంతకు ముందు, 2008 అక్టోబర్‌లో, ఆస్ట్రేలియాతో జరిగిన ఢిల్లీ టెస్టులో వివిఎస్ లక్ష్మణ్ అజేయంగా 200 పరుగులు సాధించాడు.