క్రీడాభూమి

ప్రఫుల్ పటేల్‌కు మూడోసారి ఎఐఎఫ్‌ఎఫ్ అధ్యక్ష పదవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ మూడోసారి ఆ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం న్యూఢిల్లీలో జరిగే ఎఐఎఫ్‌ఎఫ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలపై ఢిల్లీ హైకోర్టు కొద్ది రోజుల క్రితం విధించిన స్టేని మంగళవారం ఎత్తివేయడంతో ఎన్నికలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఎఐఎఫ్‌ఎఫ్ ఆఫీస్ బేరర్ల (2017-20 కాలానికి సంబంధించిన) ఎన్నికలపై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 15వ తేదీన స్టే విధించడంతో ఆ ఎన్నికలు గందరగోళంలో పడ్డాయి. అయితే మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఈ స్టేని ఎత్తివేయడంతో మళ్లీ ప్రఫుల్ పటేల్ అధ్యక్షనిగా ఎన్నికయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఎన్నికలపై స్టే విధిస్తూ ఈ నెల 15వ తేదీన జారీ చేసిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు తాజాగా సవరించి స్టేని ఎత్తివేసిందని, దీంతో ఇంతకుముందు నిర్ణయించుకున్న షెడ్యూలు ప్రకారం బుధవారమే వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎఐఎఫ్‌ఎఫ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ సమావేశంలో జరిగే కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రఫుల్ పటేల్‌తో పాటు ఐదు ఉపాధ్యక్ష పదవులకు, ఒక కోశాధికారి పదవికి, మరో పది కార్యవర్గ సభ్య పదవులకు ఒక్కొక్కరు చొప్పున మాత్రమే బరిలో నిలవడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
బరిలో మిగిలిన అభ్యర్థులు వీరే
అధ్యక్ష పదవికి ప్రఫుల్ పటేల్, ఐదు ఉపాధ్యక్ష పదవులకు సుభాష్ చోప్రా (నార్త్ జోన్), కెఎంఐ.మాథర్ (సౌత్ జోన్), సుబ్రతా దత్తా (ఈస్ట్ జోన్), మానే్వంద్ర సింగ్ (వెస్ట్ జోన్), లర్సింగ్ మింగ్ సయాన్ (నార్త్‌ఈస్ట్ జోన్), కోశాధికారి పదవికి జడ్‌ఎ.్ఠకూర్, పది కార్యవర్గ సభ్య పదవులకు దీపక్ శర్మ, దీపక్ కుమార్ (నార్త్ జోన్), జె.జెసియ్య విల్లవరయార్, ఎఆర్.ఖలీల్ (సౌత్ జోన్), గులామ్ రబ్బానీ, సంజయ్ బెహెరా (ఈస్ట్ జోన్), లాంగ్‌హింగ్లోవా హమర్, హేమేంద్ర కుమార్ బ్రహ్మ (నార్త్‌ఈస్ట్ జోన్).

చిత్రం..ప్రఫుల్ పటేల్