క్రీడాభూమి

ఇది ప్రారంభమే.. ఇంకా ఎంతో సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 20: భారత జట్టు వరసగా 18 టెస్టుల్లో విజయం సాధించినప్పటికీ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం దానికి పొంగిపోవడం లేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఈ పునాదిపై జట్టు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ‘రెండు పరాజయాలు మినహాయిస్తే ఒక జట్టుగా2016 సంవత్సరం మాకు చాలా మంచి సంవత్సరంగానే మిగిలింది. రెండు పరాజయాల్లో ఒకటి ఆస్ట్రేలియాలో జరిగిన వన్‌డే సిరీస్ కాగా, రెండవది ప్రపంచ టి-20 టోర్నమెంట్. మేము ఆసియా కప్‌ను గెలుచుకున్నాం. అలాగే భారత్‌లో న్యూజిలాండ్‌పై వన్‌డే సిరీస్‌ను గెలిచాం. ఆ తర్వాత అన్ని టెస్టు మ్యాచ్‌లను గెలిచాం. 2016 సంవత్సరం జట్టు మరపురాని సంవత్సరంగా మిగిలింది. అందుకు నేను నిజంగా గర్విస్తున్నా. అలాంటి గొప్ప సంవత్సరంలో, మంచి సీజన్‌లో అదీ ముఖ్యంగా జట్టు పరివర్తనలో ఉన్నప్పుడు భాగంగా ఉన్నందుకు నిజంగా గర్విస్తున్నా’ అని మంగళవారం ఇక్కడ భారత జట్టు ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాదించిన అనంతరం కోహ్లీ అన్నాడు. ‘అయితే ఇది మాకు చాలా సంవత్సరాలు కొనసాగడానికి వేసిన పునాదిమాత్రమే. మేము సాధించాలనుకొంటున్నది ఇది కాదు. జట్టులోని సభ్యులు గనుక ఇదే తరహా కృషి కనబరిస్తే జట్టును మరింత ఉన్నత శిఖరాలకు చేర్చగలుగుతాం’ అని కూడా కోహ్లీ అన్నాడు. నిజానికి ఇది జట్టు సంపూర్ణమైన పెర్ఫార్మెన్స్ అని, ముఖ్యంగా తొలి టెస్టులో ప్రత్యర్థి తమను ఒత్తిడికి గురి చేశాక తర్వాతి నాలుగు టెస్టులను గెలవడం చిన్న విషయం కాదని అతను చెప్పాడు. ఇప్పుడు మీ జట్టును కోహ్లీ ఇండియా టీమ్ అని అనవచ్చా అని అడగ్గా, ఆ మాట తాను అనలేనని, ఎందుకంటే జట్టులో అందరూ ఏదో ఒక సమయంలో రాణించారని కోహ్లీ చెప్పాడు.

చిత్రం..చివరి రోజు బరిలోకి దిగక ముందు విరాట్ కోహ్లీ సరదా ఫోజు