క్రీడాభూమి

మేరీ కోమ్, వికాస్‌లకు ఎఐబిఎ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంట్రెక్స్ (స్విట్జర్లాండ్), డిసెంబర్ 21: ఈ ఏడాది తమతమ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో రాణించిన భారత బాక్సర్లు, మేరీ కోమ్, వికాస్ కిషన్‌లకు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) అవార్డులు లభించాయి. అత్యంత వైభవంగా ఇక్కడ జరిగిన సమాఖ్య 70వ వార్షికోత్సవంలో మేరీ కోమ్ ‘లెజెండ్స్’ అవార్డును స్వీకరించింది. వికాస్‌కు ప్రొఫెషనల్స్ విభాగంలో ఉత్తమ బాక్సర్ ట్రోఫీ దక్కింది. ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న కోమ్, పలుమార్లు ఆసియా చాంపియన్‌షిప్స్‌ను కూడా గెల్చుకుంది. 2008లో కోమ్ నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్నప్పుడు, ఎఐబిఎ ఆమెను ‘మాగ్నిఫిషెంట్ మేరీ’గా అభివర్ణించింది. తర్వాతి కాలంలో ఆమెకు ఆ పేరు స్థిరపడింది. 33 ఏళ్ల కోమ్ ఆరంభంలో 48 కిలోల విభాగంలో పోటీ పడింది. తర్వాతి కాలంలో 51 కిలోల విభాగానికి మారింది. ఇటీవల తిరిగి 48 కిలోల విభాగంలో ఫైట్స్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఖాయమని ఆమె ఇప్పటికే ప్రకటించింది. కాగా, వికాస్‌ను ఉత్తమ బాక్సర్‌గా ఎఐబిఎ గుర్తించింది. సుమారు నాలుగు సంవత్సరాలు భారత్‌కు బాక్సింగ్ లేని కారణంగా, ప్రతిపాదనలు పంపే అవకాశం దక్కలేదు. ఇటీవలే భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)కి ఎఐబిఎ గుర్తింపు లభించింది. దీనితో అవార్డులకు భారతీయుల ఎంపిక మొదలైంది.
బిఎఫ్‌ఐకి ఎఐబిఎ పూర్తి సభ్యత్వం
కొత్తగా ఏర్పాటయిన భారత బాక్సింగ్ ఫెడరేషన్ (బిఎఫ్‌ఐ)కు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం శాశ్వత సభ్యత్వం లభించింది. స్విట్జర్లాండ్‌లోని మాంట్రెయాక్స్‌లో జరిగిన ఎఐబిఎ 70 వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. జాతీయ బాక్సింగ్ సంఘంలో పరిపాలనాపరంగా నాలుగేళ్లుగా ఏర్పడిన ప్రతిష్టంభన అనంతరం గత సెప్టెంబర్‌లో బిఎఫ్‌ఐను ఏర్పాటు చేశారు. ‘్భరత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం ఇవ్వాలని ఏఐబిఏ ఏకగ్రీవంగా తీర్మానించింది’ అని ఈ వేడుకల్లో పాలు పంచుకోవడం కోసం ప్రస్తుతం మాంట్రియాక్స్‌లో ఉన్న బిఎఫ్‌ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ ఫోన్‌లో పిటిఐకి చెప్పారు. బిఎఫ్‌ఐకి ఇప్పటికే కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ గుర్తింపు లభించింది. అయితే భారత ఒలింపిక్ సంఘం గుర్తింపు కోసం ఎదురుచూస్తూ ఉంది. కాగా ఒలింపిక్ సంఘం ఈ విషయాన్ని తనకు అనుబంధంగా ఉన్న ఒక కమిటీకి నివేదించింది.
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై 2012లో అప్పటి ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్‌ను మొదట సస్పెండ్ చేసి, ఆ తర్వాత పూర్తిగా రద్దు చేయడంతో అప్పటినుంచి దేశంలో బాక్సింగ్ క్రీడకు గ్రహణం పట్టింది. ఐఎబిఎఫ్ రద్దయిన తర్వాత 2004లో బాక్సింగ్ ఇండియా ఏర్పాటయింది కానీ అది ఏడాది కూడా నడవలేక పోయింది. 2015లో రాష్ట్రాల అనుబంధ సంఘాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో అది వీగిపోయింది. మరో ఏడాది గడిచిన తర్వాత అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య, కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతినిధుల సమక్షంలోఎన్నికలు నిర్వహించాక గత సెప్టెంబర్ లో బిఎఫ్‌ఐ రూపుదిద్దుకొంది. గత నవంబర్‌లో బిఎఫ్‌ఐ పురుషుల, మహిళల జాతీయ చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించడమే కాకుండా వచ్చే నెల జాతీయ యూత్ బాక్సింగ్ పోటీలను సైతం నిర్వహించనుంది.