క్రీడాభూమి

అల్విరో పెటెర్సెన్‌పై రెండేళ్ల నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, డిసెంబర్ 22: స్పాట్ ఫిక్సింగ్ కేసులో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ అల్విరో పెటెర్సెన్‌పై రెండేళ్ల సస్పెన్షన్ వేటు పడింది. 2014-15 సీజన్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన పలు మ్యాచ్‌లు ఫిక్సింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతకు ముందు, క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన మాజీ కెప్టెన్ హన్సీ క్రోనే ఉదంతంతో ప్రతిష్ట కోల్పోయిన క్రికెట్ సౌతాఫ్రికా (సిఎస్‌ఎ) తాజా సంఘటనపై తీవ్రంగా స్పందించింది. విచారణ జరిపిన తర్వాత గులామ్ బొడీని 20 సంవత్సరాలు ఏ స్థాయి క్రికెట్‌లోనూ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధించింది. అనంతరం జరిగిన దర్యాప్తు, సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను పరిశీలించిన తర్వాత పెటెర్సెన్‌పైన రెండేళ్ల సస్పెన్షన్ వేటు వేసింది. కాగా, నిబంధనలను తాను ఉల్లంఘించినట్టు పెటెర్సెన్ విచారణ అధికారుల ముందు అంగీకరించాడు. మ్యాచ్‌లు జరిగే పిచ్‌ల తీరు, వాతావరణ ప్రభావం, ఇరు జట్ల బలాబలాలు, విజయావకాశాలు వంటి అంశాలపై ఇతరులతో చర్చించడం లేదా అభిప్రాయాలను పంచుకోవడం నేరమని తెలిసినప్పటికీ తాను కొంత మంది వ్యక్తులతో సమావేశమైనట్టు పెటెర్సెన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ విధంగా సమావేశం కావడం, ఆ విషయాన్ని సిఎస్‌ఎ అధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచడం వంటి చర్యలు నిబంధనలకు విరుద్ధమేనని అన్నాడు. తాను చేసిన పొరపాటుకు ఎలాంటి శిక్షనైనా అనుభవిస్తానని ప్రకటించాడు. అతనే నేరాన్ని అంగీకరించడంతో సిఎస్‌ఎ రెండేళ్ల సస్పెన్షన్‌ను ఖాయం చేసింది. హన్సీ క్రానే తర్వాత, అంతర్జాతీయ క్రికెట్‌లో పేరుప్రఖ్యాతులున్న ఒక దక్షిణాఫ్రికా క్రికెటర్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో సస్పెన్షన్‌కు గురికావడం ఇదే మొదటిసారి.