క్రీడాభూమి

అతనికి కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా కొనసాగడం మహేష్ భూపతికి కష్టమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవుట్ గోయింగ్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అనంద్ అమృత్‌రాజ్ కూడా ఇలాంటి అనుమానమే వ్యక్తం చేశాడు. ఎఐటిఎ నుంచి అతనికి సరైన సహకారం లభిస్తుందా అన్నది అనుమానమేనని అన్నాడు. సహజంగా ప్రతి కొత్త కెప్టెన్‌కు ఎదురయ్యే సమస్యలే భూపతిని కూడా వేధిస్తాయని జోస్యం చెప్పాడు. మూడేళ్లు భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా సేవలు అందించిన తాను మరో ఏడాది ఎక్స్‌టెన్షన్‌ను కోరినట్టు చెప్పాడు. కానీ, ఎఐటిఎ తన ప్రతిపాదనను తిరస్కరించిందని అంటూ, న్యూజిలాండ్‌తో జరిగే పోటీలే తనకు చివరివని అన్నాడు. తనకు ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయించడం ఒకవైపు ఆనందాన్నిస్తున్నదని, కానీ, జట్టును వీడాల్సి వస్తున్నందుకు బాధగా కూడా ఉందని ఆనంద్ అన్నాడు.

చిత్రం..అనంద్ అమృత్‌రాజ్