క్రీడాభూమి

ఆసీస్, పాక్ రెండో టెస్టుకు భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 23: ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య సోమవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో ఉద్రవాద దాడులకు వ్యూహ రచన చేస్తున్నారని అనుమానిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెల్బోర్న్ చీఫ్ పోలీస్ కమిషనర్ గ్రాహం ఆస్టన్ స్పష్టం చేశాడు. క్రిస్మిస్ పండుగ, ఆ మరుసటి రోజే ప్రారంభం కానున్న రెండో టెస్టు, ఆతర్వాత నూతన సంవత్సర వేడుకలు వంటి పలు కీలక ఈవెంట్స్ నగరంలో జరగనున్న తరుణంలో భద్రతను మరింత పెంచామని అన్నాడు. అందులో భాగంగానే మెల్బోర్న్ క్రికెట్ మైదానం (ఎంసిజి) వద్ద భారీగా బలగాలను మోహరింప చేసినట్టు తెలిపాడు. ఉద్రవాద దాడులు జరగవచ్చనే సమాచారమేదీ నిఘా వర్గాల నుంచి రాలేదని, అయితే, ముందు జాగ్రత్త చర్యగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆస్టన్ వివరించాడు.