క్రీడాభూమి

రాజకీయాలు కొత్తకాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గతంలో రెండు పర్యాయాలు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడే అనురాగ్ ఠాకూర్. అందుకే, రాజకీయాలు అతనికి కొత్తకాదు. అంతేగాక, చాలా మంది క్రికెటర్లతో అతనికి మంచి సంబంధాలున్నాయి. అతను బిసిసిఐ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా వంటి సీనియర్ క్రికెటర్లకు మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కడం గమనార్హం. 25 ఏళ్ల వయసులోవనే హిమాచల్ క్రికెట్ సంఘం (హెచ్‌పిసిఎ) అధ్యక్షుడిగా ఎన్నికైన ఠాకూర్ లోక్‌సభలో ఒక ప్రైవేటు బిల్లు కూడా పెట్టాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన లేదా అందుకు సహకరించిన క్రికెటర్లు, అధికారులకు కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకురావాలన్నది అతని డిమాండ్. క్రికెట్‌పై ఎంత పట్టుకున్నా, ఆటగాళ్లతో ఎంతటి సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నా, ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు కోర్టులకు చేరడం నుంచి, లోధా కమిటీ సిఫార్సుల కేసును ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు విచారించడం వరకూ అనేకానేక పరిణామాలు చోటు చేసుకోవడంతో ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఈ కేసును కోర్టు జనవరి మూడో తేదీకి వాయిదా వేసింది. ఆ మరుసటి రోజే టిఎస్ ఠాకూర్ పదవీ విరమణ చేస్తారు. ఈ పరిస్థితుల్లో తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతున్నది.