క్రీడాభూమి

వేచి చూస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు వచ్చేనెల 3వ తేదీన ఇవ్వబోయే తీర్పు ఎలా ఉంటుందో వేచి చూస్తామని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. ప్రస్తుత పరిస్థితులు క్రికెటర్లకు మేలు చేసేవిగా లేవని ప్రో రెజ్లింగ్ లీగ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఠాకూర్ వ్యాఖ్యానించాడు. కేసు కోర్టులో ఉన్నందున తాను ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడలేనని చెప్పాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, ఏ నిర్ణయం తీసుకోవడానికైనా, సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసే వరకూ వేచి ఉండక తప్పదని అన్నాడు. ప్రభుత్వం నుంచి పైసా కూడా సహాయం తీసుకోకుండానే బిసిసిఐ ఎదిగిందని చెప్పాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న వసతులు, ఆస్తులు బిసిసిఐ స్వయంగా సమకూర్చుకున్నవేనని స్పష్టం చేశాడు. కానీ, అందరూ కాకపోయినా, కొంత మంది మాజీ క్రికెటర్లకు తమను విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. చేతిలో భారీ మొత్తాలున్నా, రూపాయి కూడా ఖర్చుపెట్టే పరిస్థితి లేదని వాపోయాడు. ఐసిసి టెస్టు క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ పేరు లేకపోవడాన్ని ఠాకూర్ తప్పుపట్టాడు.