క్రీడాభూమి

బత్రాకు ఐఒఎ సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడిగా ఎన్నికైన నరీందర్ బత్రాను భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) శుక్రవారం ఘనంగా సన్మానించింది. ఇక్కడి ఒలింపిక్ భవన్‌లో అతనితోపాటు ఐఒఎ చీఫ్ రామచంద్రన్ కూడా సన్మానం పొందాడు. ఒలింపిక్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంతో విశిష్ట సేవలు అందిస్తున్న బత్రాను ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి), ఆసియా ఒలింపిక్ మండలి (ఒసిఎ) ఇటీవల సత్కరించాయి. అదే క్రమంలో ఐఒఎ కూడా అతనిని ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా బత్రా మాట్లాడుతూ తన సేవలను గుర్తించి, సన్మానించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నాడు. దేశంతా గర్వించే రీతిలో ఎఫ్‌ఐహెచ్ అధ్యక్ష పదవిలో సేవలు అందిస్తానని చెప్పాడు.
చౌరాసియా విమర్శలు అర్థరహితం: ఐఒఎ
రియో ఒలింపిక్స్‌లో తమను అధికారులు ఎవరూ పట్టించుకోలేదని, చివరికి రవాణా సౌకర్యం కూడా సక్రమంగా లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని గోల్ఫర్ ఎస్‌ఎస్‌పి చౌరాసియా చేసిన విమర్శలను భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) తోసిపుచ్చింది. అతని ఆరోపణలు అర్థరహితమని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. చెఫ్ డె మిషన్‌గా వ్యవహరించిన రాకేష్ గుప్తా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని, అథ్లెట్లకు కనీస సౌకర్యాలు అందుతున్నాయా? లేదా? అని కూడా చూడలేదని చౌరాసియా ఒక ఇంటర్వ్యూలో ఆరోపించాడు. మిగతా అధికారులు కూడా అదే రీతిలో వ్యవహరించారని, ఫలితంగా రియోకు వెళ్లిన అథ్లెట్లలో చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నాడు. అయితే, అతని విమర్శలను ఐఒఎ ఖండించింది. రియో ఒలింపిక్స్ సమయంలో ఏమీ మాట్లాడకుండా, నాలుగు నెలల తర్వాత చౌరాసియా ఎందుకు మాట్లాడుతున్నాడని ప్రశ్నించింది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అతను అలాంటి విమర్శలు చేసి ఉండవచ్చని వ్యాఖ్యానించింది.

చిత్రం..నరీందర్ బత్రా