క్రీడాభూమి

శ్రీలంకకు కఠిన పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజబెత్, డిసెంబర్ 24: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాపై సోమవారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టులో శ్రీలంక కఠిన పరీక్ష ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తున్నది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో లంక ‘అండర్ డాగ్’ ముద్రతో బరిలోకి దిగుతున్నది. మెరుపు వేగంతో బంతులు వేసే పేసర్లు ఉన్న దక్షిణాఫ్రికాను, అక్కడి ఫాస్ట్ ట్రాక్ పిచ్‌లపై ఎదురొడ్డి నిలబడడం అనుకున్నంత సులభం కాదని ఇప్పటికే ఎన్నో సిరీస్‌లు నిరూపించాయి. సహజంగానే హోం ఎడ్వంటేజ్ దక్షిణాఫ్రికాకు ఉంది. దీనికి తోడు వెర్నన్ ఫిలాండర్, కాగిసో రబదా, కేల్ అబోట్ రూపంలో ఆ జట్టుకు ముగ్గురు మేటి ఫాస్ట్ బౌలర్లు అండగా ఉన్నారు. దక్షిణాఫ్రికా పిచ్‌లపై చెలరేగిపోయే వీరిని శ్రీలంక ఎంత వరకూ ఎదుర్కొంటుందనేది అనుమానంగానే ఉంది. మిగతా స్టేడియాలతో పోలిస్తే, మొదటి టెస్టు జరిగే సెయింట్ జార్జి పార్కు పిచ్‌పై బంతి వేగం తక్కువగా ఉంటుంది. ఇది ఒక రకంగా లంకకు ఉపయోగపడుతుంది. ఫాస్ట్ బౌలింగ్‌ను నూరుశాతం సహకరించే పిచ్‌లపై ఆడేందుకు అవసరమైన అనుభవాన్ని సంపాదించడానికి సెయింట్ జార్జి పిచ్ లంక బ్యాట్స్‌మెన్‌కు పనికొస్తుంది. అయితే, ఈ జట్టు చేతిలో వజ్రాయుధం స్టార్ స్పిన్నర్ రంగన హెరాత్ రూపంలో ఉంది. ఎన్నో సందర్భాల్లో లంకను అతను ఒంటిచేత్తో విజయాలను సాధించిపెట్టాడు. మరోసారి అతనిపైనే భారం వేసి, దక్షిణాఫ్రికాలో లంక తన ప్రస్థానాన్ని మొదలుపెట్టనుంది. గాయానికి శస్త్ర చికిత్స చేయించుకొని, ఇంకా విశ్రాంతి తీసుకుంటున్న రెగ్గులర్ కెప్టెన్ ఎబి డివిలియర్స్ ఈ సిరీస్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. మొదటి టెస్టుకు అతను అందుబాటులో ఉండడని క్రికెట్ సౌతాఫ్రికా (సిఎస్‌ఎ) ప్రకటించింది. డివిలియర్స్ లేకపోవడంతో లంక ఊరిపి పీల్చుకుంటున్నది. అయితే, దక్షిణాఫ్రికాలోని మిగతా ఆటగాళ్లు కూడా గొప్పగా రాణించే సత్తా ఉన్నవారే కాబట్టి, సర్వశక్తులు ఒడ్డి ఆడితే తప్ప సమర్థంగా ఎదుర్కోవడం కష్టం.