క్రీడాభూమి

కష్టాల్లో శ్రీలంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజబెత్, డిసెంబర్ 27: శ్రీలంకతో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు పట్టు బిగిస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైన దక్షిణాఫ్రికా జట్టు మంగళవారం శ్రీలంకను సమర్ధవంతంగా ప్రతిఘటించింది. ముఖ్యంగా వెర్నాన్ ఫిలాండర్ 35 పరుగులకే 3 వికెట్లు కైవసం చేసుకుని శ్రీలంక బ్యాట్స్‌మన్లను చక్కగా నిలువరించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు నష్టపోయి 181 పరుగులు సాధించిన శ్రీలంక జట్టు ఇంకా 105 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకుముందు 6 వికెట్ల నష్టానికి 267 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టులో నైట్‌వాచ్‌మన్లు వెర్నాన్ ఫిలాండర్ 13 పరుగులు, క్వింటోన్ డీకాక్ 37 పరుగులు సాధించి వెనుదిరగ్గా, కేశవ్ మహరాజ్ (0), కైల్ అబ్బాట్ (0) పరుగుల ఖాతా ఆరంభించకుండానే పెవిలియన్‌కు చేరారు. దీంతో కేవలం 19 పరుగులకే మిగిలిన 4 వికెట్లను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా జట్టు 286 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్ 5 వికెట్లు కైవసం చేసుకోగా, నువాన్ ప్రదీప్, రంగన హెరత్ రెండేసి వికెట్లు సాధించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టుపై దక్షిణాఫ్రికా బౌలర్లు ఆరంభం నుంచే నిప్పులు చెరిగారు. వీరి జోరును ప్రతిఘటించలేక ఓపెనర్ దైముత్ కరుణరత్న (5), కుశాల్ పెరీరా (7), కుశాల్ మెండిస్ (0), కౌశల్ సిల్వా (16) స్వల్పస్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో శ్రీలంక జట్టు 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో ఐదో వికెట్‌కు 33 పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబాడ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్ చేతికి చిక్కగా, వికెట్‌కీపర్ దినేష్ చండీమల్ 28 పరుగులు సాధించి ఫిలాండర్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించాడు. అనంతరం ఏడో వికెట్‌కు 36 పరుగులు జోడించిన రంగన హెరత్ (24)ను లెగ్ బిఫోర్ వికెట్ రూపంలో కేశవ్ మహరాజ్ పెవిలియన్‌కు చేర్చగా, ధనుంజయ డిసిల్వా (43), దుష్మంత చమీరా (7) అజేయంగా నిలిచారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు నష్టపోయి 181 పరుగులు రాబట్టిన శ్రీలంక జట్టు సఫారీల కంటే ఇంకా 105 పరుగులు వెనుకబడి ఉంది.

చిత్రం..వెర్నాన్ ఫిలాండర్ 3/35