క్రీడాభూమి

అట్టహాసంగా ఐ-లీగ్ 10వ ఎడిషన్ ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఇండియన్ సూపర్ లీగ్ (ఐ-లీగ్) 10వ ఎడిషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ మంగళవారం న్యూఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. స్ట్రైకర్ సునీల్ చెత్రి సహా పలువురు భారత ఫుట్‌బాల్ స్టార్ల సమక్షంలో అభిమానుల కోలాహలం మధ్య అట్టహాసంగా ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. దేశంలోని నాలుగు ప్రాంతాలకూ చెందిన పది జట్లు ఈ టోర్నీలో తలపడబోతున్నాయి. వీటిలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, ఐజ్వాల్ ఫుట్‌బాల్ క్లబ్, షిల్లాంగ్ లజోంగ్ జట్లు ఈశాన్య ప్రాంతానికి, ముంబయి ఫుట్‌బాల్ క్లబ్, డిఎస్‌కె శివాజియన్స్, చర్చిల్ బ్రదర్స్ జట్లు పశ్చిమ ప్రాంతానికి, బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్, చెన్నై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ జట్లు దక్షిణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఐదు సీజన్ల విరామం తర్వాత ఈ టోర్నీలో పాల్గొంటున్న ఉత్తర ప్రాంతానికి తొలిసారి మినర్వా పంజాబ్ జట్టు ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఏకీకృత లీగ్ అవశ్యం : చెత్రి
ఇదిలావుంటే, దేశంలోని ఫుట్‌బాల్ లీగ్‌లన్నీ ఏకీకృతమై ఒకే లీగ్‌గా ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని భారత స్టార్ స్ట్రైకర్ సునీల్ చెత్రి ఉద్ఘాటించాడు. దీని వలన భారత జట్టు ఫిఫా (అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య) ఆధ్వర్యంలో జరిగే మరిన్ని స్నేహపూర్వక మ్యాచ్‌లలో ఆడేందుకు అవకాశాలు లభించడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జాతీయ జట్టు స్థానం మరింత మెరుగు పడేందుకు దోహదం చేస్తుందని అతను అభిప్రాయపడ్డాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్), ఐ-లీగ్‌ల విలీన ప్రతిపాదనపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో సునీల్ చెత్రి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

చిత్రం..ఐ-లీగ్ ఫుట్‌బాల్ ట్రోఫీతో పదో ఎడిషన్ జట్ల కెప్టెన్లు