క్రీడాభూమి

117 ఏళ్ల రికార్డు బద్దలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 27: గుజరాత్‌కు చెందిన యువ బ్యాట్స్‌మన్ సమిత్ గోహెల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 117 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఒడిశాతో జరిగిన రంజీట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన 26 ఏళ్ల సమిత్ 359 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పాకిస్తాన్‌కు చెందిన హనీఫ్ మహమ్మద్ సాధించిన 499 పరుగులే ఇప్పటికీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సాధించిన అత్యధిక స్కోరు కాగా గోహెల్‌లాగా ఓపెనర్‌గా వచ్చి 359 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు. సోమవారం వ్యక్తిగత ఓవర్‌నైట్ స్కోరు 261 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన సమిత్ ఐదో రోజు మంగళవారం 359 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ రెండో ఇన్నింగ్స్‌లో 641 పరుగులు చేసింది. దీంతో సమిత్ ఈ ఏడాది ట్రిపుల్ సెంచరీ చేసిన అయిదో బ్యాట్స్‌మన్ అయ్యాడు. ఈ స్కోరుతో సమిత్ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా అత్యధిక స్కోరు సాధించిన ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో అంటే 1899లో కింగ్‌స్టన్ ఓవల్ మైదానంలో సోమర్‌సెట్‌పై సర్రే బ్యాట్స్‌మన్ బాబీ అబెల్ సాధించిన 357 పరుగుల రికార్డు ఈ దెబ్బతో బద్దలయిపోయింది. 723 బంతుల్లో 45 బౌండరీలు, ఒక సిక్స్ సాయంతో సమిత్ ఈ స్కోరు సాధించాడు.
కాగా, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ప్రపంచ రికార్డు అవుతుందనే విషయం తనకు తెలియదని సమిత్ చెప్పాడు. వీలయినంత ఎక్కువ సేపు బ్యాట్ చేయమని కోచ్ విజయ్ పటేల్, కెప్టెన్ పార్థివ్ పటేల్‌లు తనకు చెప్పారని, తాను అదే ప్రణాళికను అమలు చేశానని అతను చెప్పాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని అతను అంటూ, ఇది నిజంగా తన జీవితంలో మరిచిపోలేని రోజన్నాడు.
తన తండ్రి భానుభాయ్ పటేల్ చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అని చెప్పిన ఆనంద్‌కు చెందిన సమిత్ తాను ఇంతరవకు క్రికెట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టానన్నాడు. అయితే ఇప్పుడు తాను ప్రభుత్వ కోసం వెతుకుతున్నానని, ఆదాయం పన్ను శాఖ, లేదా దేనా బ్యాంక్‌లో స్పోర్ట్స్‌కోటా కింద ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పాడు. నిజానికి తాను ఇంతవరకు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ప్రపంచ రికార్డు గురించి చెప్పలేక పోయినట్లు కూడా సమిత్ చెప్పాడు.
కాగా, ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత ఆధారంగా గుజరాత్ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. నాగపూర్‌లో జనవరి 1నుంచి జరిగే సెమీఫైనల్లో గుజరాత్ తొలిసారి సెమీఫైనల్స్‌కు చేరుకున్న జార్ఖండ్‌ను ఎదుర్కొంటుంది.

చిత్రం..గుజరాత్ యువ బ్యాట్స్‌మన్ సమిత్ గోహెల్