క్రీడాభూమి

మా పెదనాన్న చాలా స్ట్రిక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: రెజ్లింగ్‌లో తాను, తన అక్కాచెల్లెళ్లకు కోచ్‌గా వ్యవహరించిన తమ పెదనాన్న మహావీర్ ఫొగట్ శిక్షణ సమయంలో చాలా కఠినంగా ఉంటాడని భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ చెప్పింది. దంగల్ సినిమాలో తన పెదనాన్న పాత్రను అమీర్ ఖాన్ సమర్థంగా పోషించాడని బుధవారం పిటిఐతో మాట్లాడుతూ వినేష్ చెప్పింది. అయితే, అమీర్ సినిమాలో చూపిన దానికంటే తన పెదనాన్న కనీసం పది రెట్లు ఎక్కువ స్ట్రిక్ట్‌గా ఉంటాడని తెలిపింది. ఆయన పర్యవేక్షణలోనే కుస్తీ నేర్చుకున్నానని, అందుకే ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞురాలిగా ఉంటానని తెలిపింది. మహావీర్ తన కుమార్తెలు గీతా, బబిత, రీతు, సంగీతలను రెజ్లర్లుగా తీర్చిదిద్దారు. అదే విధంగా, ఒక స్థల వివాదంలో దాడికి గురై మృతి చెందిన తన తమ్ముడి కుటుంబ బాధ్యతను కూడా అతనే స్వీకరించాడు. తమ్ముడి ఇద్దరు కుమార్తలు వినేష్, ప్రియాంకలను కూడా రెజ్లర్లుగా తీర్చిదిద్దారు. వీరిలో బబిత, గీత, వినేష్ అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లు. రీతు జాతీయ చాంపియన్. ప్రియాంక, సంగీత తమతమ ఏజ్ కేటగిరిల్లో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. ఇదే విషయాన్ని వినేష్ ప్రస్తావిస్తూ, మహావీర్ ఎన్నో త్యాగాలు చేశారని అన్నది. కుస్తీ నేర్చుకునే సమయంలో ఆయన చాలా కఠినంగా ఉంటారని, నిజానికి అందులో సగంకూడా సినిమాలో లేదని తనకు తెలిసిందని చెప్పింది. రియో ఒలింపిక్స్ సమయంలో మోకాలికి తగిన బలమైన గాయం నుంచి కోలుకుంటున్నానని వినేష అన్నది. ఇక్కడ పునరావాస కేంద్రంలో క్రమం తప్పకుండా శిక్షణకు హాజరుకావాల్సి ఉందని, అందుకే సినిమాను చూడలేకపోయానని చెప్పింది. ముంబయిలో ప్రీమియర్ షోను చూసేందుకు రావాల్సిందిగా అమీర్ స్వయంగా ఆహ్వానించాడని, కానీ, శిబిరం నుంచి బయటకు వెళ్లే అవకాశం తనకు లేదని వినేష్ తెలిపింది. తమ పెదనాన్న మహావీర్ జీవిత చరిత్ర ఆధారంగా దంగల్ సినిమా నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత రెజ్లింగ్‌పై చాలా మందికి ఆసక్తి పెరిగిందని తెలిపింది.

డోప్ ఊబిలో క్రీడలు విలవిల

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డోప్ వికృత రూపం కళ్ల ముందు ఆవిష్కృతమైంది. డోప్ ఊబిలో క్రీడలు విలవిల్లాడడం అందరికీ స్పష్టంగా తెలిసింది. గతంలో కొన్ని క్రీడా విభాగాలకు మాత్రమే పరిమితమైందనుకున్న ఈ మహమ్మారి ఇప్పుడు అన్ని క్రీడలకూ విస్తరించి, క్రీడాస్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా మారిందన్న చేదు నిజం అభిమానులను వణికిస్తున్నది. రష్యా ప్రభుత్వమే కొన్ని దశాబ్దాలుగా తమ అథ్లెట్లకు నిషిద్ధ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అలవాటు చేసిందన్న వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమ దేశ అథ్లెటిక్స్ సమాఖ్య అధికారులు, అథ్లెట్లు పెద్దతప్పే చేశారని రష్యా క్రీడా శాఖ మంత్రి విటాలీ ముట్కో ఒక బహిరంగ ప్రకటనలో స్పష్టం చేయడం పరోక్షంగా నేరాన్ని అంగీకరించడమే. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారంటూ సమాఖ్య అధికారులు, అథ్లెట్లపై విటాలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రధానిగా, దేశాధ్యక్షుడిగా పుతిన్ గతంలో సేవలు అందించిన సమయంలోనే డోపింగ్ సమస్య బలంగా ఉందని, ఈ విషయాన్ని గుర్తించకపోవడం లేదా తెలిసికూడా స్పందించకపోవడం అతని పొరపాటని చాలా మంది వాదన. పుతిన్ 1999 నుంచి 2000 వరకు రష్యా ప్రధానిగా ఉన్నాడు. 2000 నుంచి 2008 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగాడు. 2008 నుంచి 2012 వరకు తిరిగి ప్రధానిగా సేవలు అందించాడు. 2012 మే నుంచి అతను రష్యా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. తాను ప్రధానిగా, అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ డోపింగ్ సమస్య ఉందే విషయాన్ని అతని అంగీకరించక తప్పదు. ఆ మచ్చను తుడిపేసుకొని, తన ప్రతిష్ఠను పెంచుకోవడానికి పుతిన్ వచ్చే ఏడాది ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.
వెలుగులోకి తెచ్చిన వాడా
ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) నివేదిక బట్టబయలు చేసే వరకూ వ్యూహాత్మక డోపింగ్ జరుగుతున్నదన్న అనుమానం ఎవరికీ రాలేదు. ప్రభుత్వాలే స్వయంగా రంగంలోకి దిగి, అథ్లెట్లను డోపింగ్‌కు ప్రోత్సహిస్తాయనిగానీ, ఐఎఎఎఫ్ అధికారులు డబ్బు కోసం చూసీచూడనట్టు వదిలేస్తారనిగానీ ఎవరూ ఊహించలేదు. నిషిద్ధ మాదక ద్రవ్యాలను ఉపయోగించిన అథ్లెట్లను, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న దేశాలను కూడా ఐఎఎఎఫ్ అధికారులు బ్లాక్‌మెయిల్ చేసి, లక్షలాది డాలర్లు లంచాలుగా తీసుకున్నారన్నది చేదు నిజం. భారీగా ముడుపులు చెల్లించిన దేశాల్లో రష్యాది అగ్రస్థానం. అందుకే అంతర్జాతీయ క్రీడల్లో డోపింగ్ అంటే ముందుగా రష్యా గుర్తుకొస్తుంది. ఆ దేశం తీసుకోబోయే చర్యలే క్రీడా రంగానికి కీలకంగా మారతాయి.
శాపంగా మారిన డోపింగ్
క్రీడా రంగానికి డోపింగ్ శాపంగా మారింది. అత్యంత కీలక సమయాల్లో ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగించే ఉత్ప్రేరకాలు క్రీడా రంగానికి శాపంగా మారాయి. ఈ ఏడాది డోప్ కేసులు గతంతో పోలిస్తే కనీసం ఐదు రెట్లు పెరగడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ వ్యాప్తంగా డోపింగ్ నిబంధనలను అతిక్రమిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలవడం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. రష్యాలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం, ఎక్కువ కష్టపడకుండానే అందలం ఎక్కడం కోసం మాదక ద్రవ్యాలను వినియోగించడం ప్రపంచ క్రీడా రంగంలో ఒక విషసంస్కృతిని అలవాటు చేసింది. డోపింగ్ చీడ సోకిన క్రీడా రంగం అనేక సందర్భాల్లో పరువు పోగొట్టుకుంది. రష్యా ఉదంతం సరికొత్త కోణాలను ఆవిష్కరించగా, భారత్, కెన్యా, ఇథియోపియా తదితర దేశాల్లో పెరుగుతున్న డోపింగ్ కేసులు ఆందోళనకు కారణమవుతున్నాయి.
ఎన్నో మార్గాలు
డోపింగ్ దోషులను పట్టుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, వాటిని నుంచి తప్పించుకోవడానికి వారు ఎన్నో కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. సరికొత్త మార్గాల్లో అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడుతున్నారని, వాడా ఆధ్వర్యంలోని స్వతంత్ర కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన డిక్ పౌండ్ స్పష్టం చేస్తున్నాడు. ఏఏ దేశాలకు చెందిన అథ్లెట్లు నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించారో, అందుకు వారు ఏఏ మార్గాలను అనుసరించారో, వారికి ఎవరెవవరు సహకరించారో పూర్తి సమాచారం కమిటీ వద్ద ఉందని డిక్ పౌండ్ చేసిన ప్రకటన పరిస్థితి మరింత జటిలమయ్యే ప్రమాదాన్ని సూచిస్తున్నది. ఏదిఏమైనా, డోపింగ్‌కు ఐఎఎఎఫ్ అధికారులు సహకరించడం, ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించడం క్రీడా రంగంలో చోటు చేసుకున్న అవినీతికి, అరాచకానికి పరాకాష్ట. ఎవరూ ఊహించని రీతిలో, చిత్రాతిచిత్రంగా ఏ విధంగా మోసాలు జరుగుతాయో కూడా వాడా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటిలోని అంశాల ద్వారా పరువు పోగొట్టుకున్న దేశాల్లో రష్యాది మొదటి స్థానం. అందుకే, అక్కడ తీసుకోబోయే చర్యలే ప్రపంచ అథ్లెటిక్స్ దిశను నిర్దేశించడం ఖాయం.
ఐఎఎఎఫ్‌పై విమర్శల వెల్లువ
డోపింగ్ విస్తరిస్తున్నా, దానిని నివరించే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి, నిధుల కుంభకోణం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎఎఎఫ్‌ను ఇప్పుడు డోప్ సంబంధిత సమస్యలు కూడా చుట్టుముట్టాయి. ఐఎఎఎఫ్ మాజీ చీఫ్ లామిన్ డియాక్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తగా, ప్రస్తుత చీఫ్ సెబాస్టియన్ కోపైనా విమర్శలున్నాయి. రష్యా ప్రభుత్వం డోపింగ్‌ను ప్రోత్సహించిందని వాడా దర్యాప్తులో వెల్లడికావడం సెబాస్టియన్ కోపై విమర్శలకు తావిచ్చాయి. రష్యా ఉదంతంతోపాటు అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడుతూ, ఉన్నతాధికారులకు భారీగా లంచాలిచ్చి ఎలాంటి సమస్యలు రాకుండా తప్పించుకోవడం కూడా ఐఎఎఎఫ్ అధికారులకు తెలిసే ఉంటుందని వాడా తన నివేదికలో తేల్చిచెప్పింది. భారీ కుంభకోణాలు చోటు చేసుకుంటున్నప్పటికీ ఉదాసీన వైఖరిని ప్రదర్శించారంటూ వారిపై విమర్శలు కురిపించింది. ఈ వరుస విమర్శలు, ఆరోపణలు ఐఎఎఎఫ్ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీశాయి. అందుకే స్పాన్సర్‌షిప్‌ను నెస్లే ఉపసంహరించుకుంది. వచ్చే ఏడాదైనా ఈ సమస్యలు, ఆరోపణలు సుడి గుండం నుంచి ఐఎఎఎఫ్ బయటపడుతుందో లేదో చూడాలి.