క్రీడాభూమి

దక్షిణాఫ్రికాకు ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోర్ట్ ఎలిజబెత్, డిసెంబర్ 28: శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు 81 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్‌కాగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మ్యాచ్ రెండో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లకు 181 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఉదయం ఆటను కొనసాగించి 205 పరుగులకు ఆలౌటైంది. అనంతరం దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయితే, ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గిన తర్వాత ఆట మళ్లీ మొదలుకాగా, దక్షిణాఫ్రికా ఐదు వికెట్లకు 351 పరుగులు చేసింది. స్టెఫెన్ కుక్ (117) సెంచరీ చేయగా, డీన్ ఎల్గార్ (52) అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. షహీం ఆమ్లా 48 పరుగులు సాధించాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి క్వింటన్ డి కాక్ 42, ఫఫ్ డు ప్లెసిస్ 41 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికాకు ఇప్పటి వరకూ 432 పరుగుల ఆధిక్యం లభించగా, ఐదు వికెట్లు చేతిలో ఉన్నాయి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో, వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడితే తప్ప, ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది.