క్రీడాభూమి

వెనక్కు తగ్గకపోతే గుర్తింపు రద్దు చేస్తాం: కేంద్రం అల్టిమేటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పలు ఆరోపణలపై కోర్టు కేసులను ఎదుర్కొంటున్న కల్మాడీ, అభయ్ చౌతాలాలకు జీవితకాల అధ్యక్ష పదవిని కట్టబెడుతూ తీర్మానాన్ని ఆమోదించడంపై ఐఒఎకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ షకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణించింది. ఐఒఎ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకూ అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. గుర్తింపును రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఒలింపిక్ ఉద్యమానికి, క్రీడాస్ఫూర్తికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ, కళంకితులను ప్రతిష్టాత్మక పదవులకు ఎన్నుకోడం ఏ విధంగానూ సమర్థనీయం కాదని కేంద్ర క్రీడాశాఖ స్పష్టం చేసింది. లైఫ్‌టైమ్ ప్రెసిడెంట్ హోదాలను ఎందుకు కల్పించాల్సి వచ్చిందో, వాటికి కళంకితులను ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందో వివరించాలంటూ ఐఒఎకు షోకాజ్ నోటీసును పంపింది. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించింది. అప్పటి వరకూ ఐఒఎతో అన్ని సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపింది. అంతేగాక, కేంద్ర గుర్తింపును కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది.
కేంద్ర జోక్యం తగదు: చౌతాలా
ఐఒఎ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం తగదని జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నికైన అభయ్ సింగ్ చౌతాలా అన్నాడు. భారత క్రీడలపై తన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తాడు. తనపై క్రిమినల్ కేసు ఉన్నట్టు గోయల్ ప్రకటించాడని, కానీ నిజానికి అలాంటి కేసు ఏమీ లేదని చౌతాలా చెప్పాడు. రాజకీయాలకు సంబంధించిన కేసు మాత్రమే కొనసాగుతున్నదని, దానిని క్రీడల్లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలకు ఆపాదించడం తప్పని పేర్కొన్నాడు. రాజకీయ కుట్రలతో తనను అణచి వేయడానికి ప్రయత్నిం చడం తప్పని వ్యాఖ్యానించాడు.