క్రీడాభూమి

వార్నర్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 28: ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీ చేయడంతో, పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎదురుదాడిని కొనసాగిస్తున్నది. అంతకు ముందు పాకిస్తాన్ 9 వికెట్లకు 443 పరుగుల భారీ స్కోరువద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆటలో సెంచరీ చేసి నాటౌట్‌గా ఉన్న ఓపెనర్ అజర్ అలీ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఆరు వికెట్లకు 310 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన పాక్ మరో ఏడు పరుగులకే మహమ్మద్ అమీర్ (29) వికెట్‌ను కోల్పోయింది. మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి, 65 బంతుల్లోనే, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 65 పరుగులు చేసిన సొహైల్ ఖాన్ రనౌట్ అయ్యాడు. వాహబ్ ఒక పరుగు చేసి అవుటైన వెంటనే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు పాక్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ప్రకటించాడు. అప్పటికి అజర్ 205 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 364 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 20 ఫోర్లు ఉన్నాయి.
పాక్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 46 పరుగుల వద్ద ఓపెనర్ మాట్ రెన్‌షా (10) వికెట్‌ను కోల్పోయింది. అయితే, ఫస్ట్‌డౌన్ ఆటగాడు ఉస్మాన్ ఖాజాతో కలిసి వార్నర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. రెండో వికెట్‌కు 198 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు. 143 బంతులు ఎదుర్కొని, 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 144 పరుగులు సాధించిన అతనిని వికెట్‌కీపర్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ క్యాచ్ అందుకోగా వాహబ్ రియాజ్ అవుట్ చేశాడు. సెకండ్ డౌన్‌లో మైదానంలోకి వచ్చిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌తో కలిసి మరో వికెట్ కూలకుండా ఖాజా జాగ్రత్త పడ్డాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 58 ఓవర్లలో రెండు వికెట్లకు 278 పరుగులు చేసింది. ఖాజా 95, స్మిత్ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 6 వికెట్లకు 310): 126.3 ఓవర్లలో 9 వికెట్లకు 443 పరుగులు డిక్లేర్డ్ (అజర్ అలీ 205 నాటౌట్, అసద్ షఫీక్ 50, సొహైల్ ఖాన్ 65, జొస్ హాజెల్‌వుడ్ 3/50, జాక్సన్ బర్డ్ 3/113).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 58 ఓవర్లలో 2 వికెట్లకు 278 (డేవిడ్ వార్నర్ 144, ఉస్మాన్ ఖాజా 95 నాటౌట్).