క్రీడాభూమి

ఆ పదవి నాకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) కట్టబెట్టిన జీవితకాల అధ్యక్ష పదవిని సురేష్ కల్మాడీ తిరస్కరించాడు. అవినీతి, ఆశ్రీత పక్షపాతం, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలపై ఐఒఎ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన కల్మాడీని మంగళవారం చెన్నైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జీవితకాల అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కొంటున్న మరో కళంకితుడు అభయ్ సింగ్ చౌతాలాకు కూడా లైఫ్‌టైమ్ ప్రెసిడెంట్ హోదాను కట్టబెట్టారు. అయితే, వీరిద్దరినీ మళ్లీ ఐఒఎ పదవులకు ఎన్నికోవడం సర్వత్రా విమర్శలకు కారణమైంది. కేంద్ర మాజీ క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్ ఐఒఎ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. ఇది బాధాకరమైన నిర్ణయమని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకచడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఐఒఎ నిర్ణయంపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రానికి సూచించారు. ప్రస్తుత కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ కూడా దాదాపు ఇదే రీతిలో స్పందించారు. ఐఒఎ నిర్ణయం బాధాకరమేగాక, రాజ్యాంగ విరుద్ధమైనదని ఆయన అన్నారు. కళంకితులను ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టడం ఒక దుష్ట సంప్రదాయాన్ని ప్రవేశపెట్టడమేనని వ్యాఖ్యానించారు. ఇలావుంటే, సర్వత్రా పెల్లుబుకుతున్న నిరసనల నేపథ్యంలో, ఐఒఎ శాశ్వత అధ్యక్ష పదవిని కల్మాడీ తిరస్కరించాడు. చెన్నై సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై కల్మాడీకి స్పష్టమైన వివరాలు తెలియవని, అయితే, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా స్పందించాడని అతని తరఫు లాయర్ హితేన్ జైన్ ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు. ఐఒఎలో పదవులను స్వీకరించడానికి కల్మాడీ సుముఖంగా లేరని జైన్ స్పష్టం చేశాడు.