క్రీడాభూమి

ఐఒసి వద్దంటే వదులుకుంటా: చౌతాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తనకు లభించిన ఐఒఎ జీవితకాల అధ్యక్ష పదవిని ఐఒసి వద్దంటే, వెంటనే దానిని వదులుకుంటానని కల్మాడీతోపాటు ఆ హోదాను పొందిన అభయ్ సింగ్ చౌతాలా ప్రకటించాడు. అవినీతి, ఆశ్రీత పక్షపాతం, నిధుల దుర్వినియోగం వంటి పలు ఆరోపణలు కల్మాడీ, చౌతాలాపై ఉన్నాయి. న్యూఢిల్లీలో కామనె్వల్త్ గేమ్స్ సమయంలో చోటు చేసుకున్న అవినీతి కుంభకోణంలో కల్మాడీ జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు. అప్పట్లో అతను ఐఒఎకు అధ్యక్షుడిగా ఉండేవాడు. కాగా, కల్మాడీకి అన్ని విధాలా సహకరించి, భారీగా నిధులు దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలను చౌతాలా ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి వ్యక్తులను చెన్నైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జీవితకాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మాజీ క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్ కూడా ఐఒఎ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. పలువురు క్రీడా ప్రముఖులు, మాజీ క్రీడాకారులు సైతం ఐఒఎ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఈ ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకచడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. ఐఒఎపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రానికి సూచిస్తున్నారు. కళంకితులను ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టడం అన్నది ఒక దుష్ట సంప్రదాయాన్ని ప్రవేశపెట్టడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో తాను ఐఒఎ జీవితకాల అధ్యక్ష పదవిని తిరస్కరిస్తున్నట్టు కల్మాడీ ప్రకటించాడు. అయితే, చౌతాలా మాత్రం పదవిని వదులుకోవడానికి సుముఖంగా లేడని మరోసారి స్పష్టమైంది. ఐఒఎ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం తగదని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో చౌతాలా తెలిపాడు. భారత క్రీడారంగాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి విజయ్ గోయల్ ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తాడు. పదవులపై తనకు మక్కువ లేదంటూనే, ఐఒసి అభ్యంతరం వ్యక్తం చేస్తే, తాను ఐఒఎ లైఫ్‌టైమ్ ప్రెసిడెంట్ పదవిని స్వీకరించబోనని తెలిపాడు.