క్రీడాభూమి

ఐఒఎ దారి ఎటో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీకి భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) సిద్ధమవుతుందా లేక రాజీకి వస్తుందా అన్నది ఆసక్తి రేపుతున్నది. పలు ఆరోపణలపై కోర్టు కేసులను ఎదుర్కొంటున్న కల్మాడీ, అభయ్ చౌతాలాలకు జీవితకాల అధ్యక్ష పదవిని కట్టబెడుతూ తీర్మానాన్ని ఆమోదించడంపై ఐఒఎకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. అయితే, షోకాజ్ నోటీసుకు జవాబు ఇవ్వడంపై గురువారం రాత్రి పొద్దుపోయే వరకూ ఐఒఎ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి)ని సంప్రదించిన తర్వాతే తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసుకుంటుందని ఐఒఎ వర్గాలు అంటున్నాయి. కల్మాడీ, చౌతాలా నియామకాలను రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అభివర్ణించిన విషయం తెలిసిందే. ఐఒఎ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకూ అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. గుర్తింపును రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. శుక్రవారంలోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని, లేకపోతే, కఠినంగా వ్యవహరించక తప్పదని తాజాగా అల్టిమేటం జారీ చేసింది. కళంకితులను ప్రతిష్టాత్మక పదవులకు ఎన్నుకోడం ఒలింపిక్ స్ఫూర్తికి విరుద్ధమని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ వ్యాఖ్యానించారు. జీవితకాల అధ్యక్షులుగా కల్మాడీ, చౌతాలా ఎన్నిక ఏ విధంగానూ సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. వారిద్దరికీ లైఫ్‌టైమ్ ప్రెసిడెంట్ హోదాలను ఎందుకు కట్టబెట్టారో వివరించాలంటూ పంపిన షోకాజ్ నోటీసుకు ఐఒఎ శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. జాతీయ ఒలింపిక్ కమిటీ (ఎన్‌ఒసి)గా ఐఒఎను ప్రభుత్వం గుర్తించిందని గుర్తుచేశారు. ప్రభుత్వ అండదండలు, ఆర్థిక సహాయాసహకారాలతోనే ఐఒఎ వ్యవహారాలు కొనసాగుతున్నాయని గోయల్ తెలిపారు. ఎప్పుడైనా ఒలింపిక్ ఉద్యమానికి, క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఐఒఎ ప్రవర్తిస్తే, వెంటనే జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని ఆయన తేల్చిచెప్పారు. సహాయాన్ని నిలిపివేయడమేగాక, అవసరమైతే గుర్తింపును రద్దు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. శుక్రవారంలోగా ఐఒఎ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోతే, తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామని అన్నారు. ‘మీ సమాధానం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల్లోగా మాకు చేరాలి. లేకపోతే, మీరు చెప్పాల్సింది ఏమీ లేదన్న అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఆతర్వాత నిబంధనలను అనుసరించి తగిన చర్యలు తీసుకుంటాం’ అంటూ ఐఒసిని గట్టి వార్నింగ్ ఇచ్చారు. చౌతాలా లేదా మరే ఇతరులతో తమకు వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన అన్నారు. అయితే, ఐఒఎ తీసుకున్న నిర్ణయం భారత క్రీడా రంగం భవిష్యత్తుకు మంచిది కాదన్నదే ప్రభుత్వ అభిప్రాయమని పేర్కొన్నారు.