క్రీడాభూమి

స్మిత్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 29: కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అజేయ శతకం చేయడంతో, పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 22 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాకిస్తాన్ 9 వికెట్లకు 443 పరుగుల భారీ స్కోరువద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. పాక్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడోరోజు ఆట ముగిసే సమయానికి 58 ఓవర్లలో రెండు వికెట్లకు 278 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు, గురువారం ఉదయం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా వర్షం కారణంగా నిలిపివేసే సమయానికి ఆరు వికెట్లకు 465 పరుగులు సాధించింది. దీనితో ఈ జట్టుకు పాక్‌పై 22 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంకా నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి. మూడో రోజు ఆటలో డేవిడ్ వార్నర్ మెరుపు సెంచరీ చేయగా, నాలుగో రోజు స్మిత్ సరిగ్గా 100 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజా 97 పరుగులు చేసి, సెంచరీ పూర్తికాక ముందే, వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో సర్ఫ్‌రాజ్ అహ్మద్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. స్మిత్ క్రీజ్‌లో నిలదొక్కుకోగా, పీటర్ హ్యాండ్‌కోమ్స్ (54) అర్ధ శతకం చేశాడు. నిక్ హాడిసన్ (22), మాథ్యూ వేడ్ (9) తక్కువ పరుగులకే అవుట్‌కాగా, స్మిత్‌తోపాటు మిచెల్ స్టార్క్ (7) క్రీజ్‌లో ఉన్నాడు.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 6 వికెట్లకు 310): 126.3 ఓవర్లలో 9 వికెట్లకు 443 పరుగులు డిక్లేర్డ్ (అజర్ అలీ 205 నాటౌట్, అసద్ షఫీక్ 50, సొహైల్ ఖాన్ 65, జొస్ హాజెల్‌వుడ్ 3/50, జాక్సన్ బర్డ్ 3/113).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 58 ఓవర్లలో 2 వికెట్లకు 278): 113.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 465 (డేవిడ్ వార్నర్ 144, ఉస్మాన్ ఖాజా 97, స్టీవెన్ స్మిత్ 100 నాటౌట్, పీటర్ హ్యాండ్స్‌కోమ్ 54, నిక్ మాడిసన్ 22, సొహైల్ ఖాన్ 2/86, యాసిర్ షా 2/150, వాహబ్ రియాజ్ 2/135).