క్రీడాభూమి

ఆస్ట్రేలియా మెరుపు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 31: డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్న మ్యాచ్‌లో మెరుపు దెబ్బ తీసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 18 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ జరిగిన రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 443 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మ్యాచ్ నాలుగో రోజు వర్షం కారణంగా నిలిపివేసే సమయానికి ఆరు వికెట్లకు 465 పరుగులు సాధించింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను కొనసాగించి, ఎనిమిది వికెట్లకు 624 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మిచెల్ స్టార్క్ 84 పరుగులు సాధించడం విశేషం. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు వెనుకబడిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించినప్పుడు, మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా పాక్ బ్యాటింగ్ కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లు, ప్రత్యేకించి మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్‌లను సమర్థంగా ఎదుర్కోలేక పాక్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ అజర్ అలీ (43), లోయర్ మిడిల్ ఆర్డర్‌లో వికెట్‌కీపర్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ (43) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో పాక్ రెండో ఇన్నింగ్స్‌కు 53.2 ఓవర్లలో 163 పరుగుల వద్ద తెరపడింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 18 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 6 వికెట్లకు 310): 126.3 ఓవర్లలో 9 వికెట్లకు 443 పరుగులు డిక్లేర్డ్ (అజర్ అలీ 205 నాటౌట్, అసద్ షఫీక్ 50, సొహైల్ ఖాన్ 65, జొస్ హాజెల్‌వుడ్ 3/50, జాక్సన్ బర్డ్ 3/113).
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 113.5 ఓవర్లలో 6 వికెట్లకు 465): 142 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 624 డిక్లేర్డ్ (డేవిడ్ వార్నర్ 144, ఉస్మాన్ ఖాజా 97, స్టీవెన్ స్మిత్ 165 నాటౌట్, పీటర్ హ్యాండ్స్‌కోమ్ 54, మిచెల్ స్టార్క్ 84, సొహైల్ ఖాన్ 3/131, యాసిర్ షా 3/207, వాహబ్ రియాజ్ 2/147).
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్: 53.2 ఓవర్లలో 163 ఆలౌట్ (అజర్ అలీ 43, సర్ఫ్‌రాజ్ నవాజ్ 43, కేశవ్ మహారాజ్ 3/86, కాగిసో రబదా 3/77).

చిత్రం..పాక్‌ను ఓడించిన ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆనందం