క్రీడాభూమి

ఐఒఎపై చర్య సబబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 31: క్రీడా సంఘాల్లో కళంకితులను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) గుర్తింపును భారత ప్రభుత్వం రద్దు చేసిందని శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ చెప్పారు. ఆయన శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ ఆఫీసులో మాట్లాడుతూ కల్మాడీ, అభయ్ సిం గ్ చౌతాలా ఎన్నిక తీర్మానాన్ని ఉపసంహరించుకు నే వరకూ ఐఒఎను కేంద్రం సస్పెండ్ చేయడాన్ని స మర్థించారు. చట్ట ప్రకారం ఎవరి చర్యలు తీసుకునే ముందు, షోకాజ్ నోటీసులు ఇచ్చిన తరువాతే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. భారత క్రీడా సంస్థ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్‌లో ఎప్పటి నుంచో ఉన్న వివాదానికి కూడా ముఖ్యమంత్రి ముగింపు పలికారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్ క్రీడలను దృష్టిలో పెట్టుకుని గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, పురుషోత్తం ఒలంపిక్ టీమ్‌లను గుర్తించినట్టు చెప్పారు. అదే విధంగా క్రీడాకారులు శ్రీకాంత్, రజనీలకు కూడా త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటించిన చెక్కుల మొత్తాన్ని అందజేస్తామని చెప్పారు. గతంలో ఒలింపిక్ సంఘానికి సంబంధించి భారత ఒలంపిక్ సంఘం గుర్తింపు చూపించమని హైకోర్టు అడిగిందని, రాష్ట్రంలో క్రీడల ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. 2018లో జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించడానికి చెన్నైలో బిడ్డింగ్‌లో క్రీడాశాఖ మంత్రి అచ్చెంనాయుడు బిడ్డింగ్ వేశారని వివరించారు. శాప్ రెండుగా రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డాయని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఆడిట్ జరగలేదని తెలిపారు. క్రీడల్లో పారదర్శక పరిపాలన జరగాలంటే ఆడిట్ జరగాలని, అప్పుడే లోపాలను గుర్తించడం, మంచిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోలు చేసిన క్రీడాకారుల ఆట వస్తువులను, ఇరు రాష్ట్రాలు 52:48 దామాషా ప్రకారం సంప్రదింపులు ద్వారా రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాల్సిన అవసరంతో పాటు ఆ విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో కొనుగోలు చేసిన పడవలు, రైఫిల్ షూటింగ్‌కు సంబంధించిన గన్స్, కయాకింగ్‌కు చెందిన పడవుల్లో ఆంధ్రప్రదేశ్ వాటాగా కొన్ని దక్కాల్సి వుందని తెలిపారు. పిఆర్‌వో, ఎకౌంట్ ఆఫీసర్, ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల పోస్టులను శాప్‌కు తెచ్చుకోవాలన్నారు.