క్రీడాభూమి

బంగాపై కివీస్ క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీల్సన్, డిసెంబర్ 31: బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన చివరి వనే్డను 8 వికెట్ల తేడాతో గెల్చుకున్న న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు సాధించగా, న్యూజిలాండ్ లక్ష్యాన్ని మరో 52 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, ఇమ్రుల్ కయాస్ శుభారంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు 102 పరుగులు జోడించిన తర్వాత, మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో నీల్ బ్రూమ్ క్యాచ్ అందుకోవడంతో ఇమ్రుల్ అవుట్‌కాగా, బంగ్లా తొలి వికెట్‌ను కోల్పోయింది. అప్పటి వరకూ పటిష్టంగా కనిపించిన ఈ జట్టు ఆతర్వాత భారీ భాగస్వామ్యాలు లేకపోవడంతో, అభిమానులు ఆశించినట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. తమీమ్ 88 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్ల సాయంతో 59 పరుగులు చేసి, జినీ నీషమ్ బౌలింగ్‌లో నీల్ బ్రూమ్‌కు చిక్కాడు. లోయల్ మిడిల్ ఆర్డర్‌లో వికెట్‌కీపర్ నూరుల్ హసన్ (44) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో, బంగ్లాదేశ్ 9 వికెట్లకు 236 పరుగులు చేయగలిగింది. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
అప్పటికే మొదటి రెండు వనే్డలను తన ఖాతాలో వేసుకున్న న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్‌పై దృష్టి నిలిపింది. మొదటి వికెట్ కేవలం 10 పరుగుల స్కోరువద్ద టామ్ లాథమ్ (4) వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ కాలి కండరాలు బెణకడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అతను బంగ్లాదేశ్‌తో జరిగే టి-20 సిరీస్‌కు అందుబాటులో ఉండడని క్రికెట్ న్యూజిలాండ్ ప్రకటించింది. ఇలావుంటే, ఓపెనర్లు ఇద్దరూ క్రీజ్‌లో లేని పరిస్థితుల్లో జట్టును గెలిపించే బాధ్యతను కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, నీల్ బ్రూమ్ స్వీకరించారు. రెండో వనే్డలో సెంచరీ చేసిన బ్రూమ్ వరుసగా రెండో సెంచరీ సాధించే ఊపుమీద కనిపించాడు. కానీ, 97 బంతుల్లో 97 పరుగులు చేసిన అతను ముష్ఫికర్ రహ్మాన్ బౌలింగ్‌లో మష్రాఫ్ మొర్తాజా క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్న బ్రూమ్ పెవిలియన్ చేరిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జిమీ నీషమ్ (23 బంతుల్లో 28)తో కలిసి విలియమ్‌సన్ (116 బంతుల్లో 95) మరో వికెట్ కూలకుండా జట్టును గెలిపించాడు.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 (తమీమ్ ఇక్బాల్ 59, ఇమ్రుల్ కయాస్ 44, నూరుల్ హసన్ 44, మాట్ హెన్రీ 2/53, మిచెల్ సాంట్నర్ 2/38).
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 41.2 ఓవర్లలో 2 వికెట్లకు 239 (కేన్ విలియమ్‌సన్ 95 నాటౌట్, నీల్ బ్రూమ్ 97, జిమీ నీషమ్ 28 నాటౌట్, ముస్ట్ఫిజుర్ రహ్మాన్ 2/32).