క్రీడాభూమి

పాక్‌పై క్లీన్‌స్వీప్ స్మిత్ సేన లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 1: మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్పీప్ చేయడమే లక్ష్యంగా, మంగళవారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న చివరి, మూడో టెస్టులో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. వరుస పరాజయాల నుంచి బయటపడిన స్టీవెన్ స్మిత్ నాయకత్వంలోని ఆసీస్ ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలను సాధించింది. మొదటి టెస్టును 39 పరుగుల తేడాతో సొంతం చేసుకున్న స్మిత్ సేన రెండో టెస్టును ఏకంగా ఇన్నింగ్స్ 18 పరుగుల తేడాతో తన ఖాతాలో వేసుకుంది. సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకొని, చివరి టెస్టులోనూ గెలిచి, ప్రత్యర్థికి వైట్‌వాష్ వేసేందుకు సమాయత్తమవుతున్నది. భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని, పాక్‌తో చివరి టెస్టులో స్పిన్‌కు ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. ఉప ఖండంలో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి కాబట్టి, ఇప్పటి నుంచి ప్రయోగాలు చేయాలన్న ఆలోచనలో ఆసీస్ జట్టు మేనేజ్‌మెంట్ ఉన్నట్టు సమాచారం. భారత్‌కు బయలుదేరే ముందే, అన్ని విభాగాల్లోనూ తమను తాము నిరూపించుకోవడానికి ఇదే సరైన తరుణమని అనుకుంటున్నది. కాగా, ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లోనూ పరాజయాలను చవిచూసి, సిరీస్‌ను చేజార్చుకున్న మిస్బా ఉల్ హక్ కెప్టెన్సీలోని పాకిస్తాన్‌కు క్లీన్‌స్వీప్ నుంచి బయటపడేందుకు ఇదే చివరి అవకాశం కాబట్టి, ఆ జట్టులో ప్రతి ఒక్కరూ సర్వశక్తులు ఒడ్డడం ఖాయం. పాకిస్తాన్‌కు ఇంత వరకూ 52 టెస్టుల్లో నాయకత్వం వహించి, గతంలో ఎవరూ సాధించని రీతిలో 24 విజయాలను అందించిన మిస్బా తాను రిటైర్మెంట్‌పై ఆలోచిస్తున్నానని చేసిన ప్రకటన ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నది. రెండో టెస్టు ముగిసిన తర్వాత మిస్బా విలేఖరులతో మాట్లాడుతూ, వైఫల్యాలకు కారణాలు వెతుక్కోవడం లేదని స్పష్టం చేశాడు. బాధ్యతన తనదేనన్న అతను రిటైర్మెంట్ ఆలోచన ఉన్నట్టు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మొదలుకానున్న చివరి టెస్టులో పాక్ ఎంత వరకూ ఆత్మవిశ్వాసంతో ఆడుతుందనేది అనుమానంగానే ఉంది.