క్రీడాభూమి

వ్యాయామానికి మతంతో పనేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: వ్యాయామానికి మతంతో ఎలాంటి సంబంధం లేదని, సోషల్ మీడియాలో తాను ఉంచిన ఫొటోలపై రాద్ధాంతం తగదని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. ఫిజికల్ వర్కవుట్ రొటీన్‌లో భాగంగా అతను సూర్య నమస్కారాలు చేయడం విమర్శలకు కారణమైంది. కైఫ్ పెట్టిన ఫొటోలు మత విశ్వాసాలను కించ పరిచేవిగా ఉన్నాయంటూ కొంత మంది ఇస్లామిక్ మతవాదులు విమర్శలు గుప్పించారు. సూర్య నమస్కారాలు చేయడం ఒక తప్పయితే, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచడం మరో తప్పని ధ్వజమెత్తారు. అయితే, ఆ విమర్శలకు కైఫ్ బెదిరిపోలేదు. దీటైన సమాధానమే ఇచ్చాడు. అల్లాను కొలుస్తానని, ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేస్తానని స్పష్టం చేశాడు. ఎలాంటి పరికరాలు లేకుండా, ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామాల్లో సూర్య నమస్కారాలు ప్రధానమైనవని పేర్కొన్నాడు. వ్యాయామానికి మతంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాడు. ఇటీవల కాలంలో ఇస్లాం మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నాడంటూ విమర్శలు ఎదుర్కొన్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి కైఫ్ బాసటగా నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. షమీ తన భార్య, కమార్తె ఫొటోతో కలిసి తీయించుకున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో ఉంచడం విమర్శలకు తావిచ్చింది. అతని భార్య స్లీవ్‌లెస్ దుస్తులను వేసుకుందని, ఇది ఇస్లాం మత విశ్వాసాలకు విరుద్ధమని కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి షమీ కూడా దీటుగానే స్పందించాడు. ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసునని, ఎవరూ మార్గదర్శకం చేయాల్సిన అవసరం లేదని చురకలంటించాడు. విమర్శకుల నోళ్లు మూయించాడు. అతని మాదిరిగానే కైఫ్ కూడా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం విశేషం.

చిత్రం..సూర్య నమస్కారాలు చేస్తున్న కైఫ్