క్రీడాభూమి

సుప్రీం కోర్టు దెబ్బతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, జనవరి 2: కేరళ క్రికెట్ అసోసియేషన్ (కెసిఎ)లో ఏకమొత్తంగానో లేక విడివిడిగానో ఇప్పటికే తొమ్మిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న అధ్యక్షుడు టిసి.మాథ్యూ, కార్యదర్శి అనంతనారాయణ్‌తో పాటు ఇతర ఆఫీస్ బేరర్లు సోమవారం తమతమ పదవుల నుంచి వైదొలిగారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేసి తీరాల్సిందేనని సుప్రీం కోర్టు సోమవారం మరోసారి బిసిసిఐకి తేల్చిచెప్పడమే ఇందుకు కారణం. బిసిసిఐ, దాని అనుబంధ సంఘాల్లో తొమ్మిదేళ్ల పాటు పదవులు అనుభవించిన ఆఫీస్ బేరర్లు మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదని లోధా కమిటీ చేసిన సిఫారసును సుప్రీం కోర్టు గతంలోనే ఆమోదించడంతో వీరంతా గత్యంతరం లేక పదవుల నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో కెసిఎ సోమవారం సాయంత్రం కొచ్చిలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి కొత్త అధ్యక్షుడిగా బి.వినోద్‌ను, కార్యదర్శిగా జయేష్ జార్జిని నియమించింది. జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడంలో విఫలమైన బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను ఆయా పదవుల నుంచి తొలగిస్తున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసిన కొద్ది గంటలకే కెసిఎలో ఈ మార్పులు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి.