క్రీడాభూమి

అందరూ అందరే.. కొత్త బాస్ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రక్షాళన కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయడంలో విఫలమైనందుకు బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలకు సర్వోన్నత న్యాయస్థానం ఉద్వాసన పలకడంతో తాత్కాలిక అధ్యక్షునిగా బోర్డులోని ఐదుగురు ఉపాధ్యక్షుల్లో ఎవరిని నామినేట్ చేయాలన్న దానిపై బిసిసిఐ మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతం సెంట్రల్ జోన్ నుంచి బిసిసిఐలో మూడోసారి ఉపాధ్యక్షునిగా ఉన్న డిడిసిఎ (్ఢల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) వెటరన్ అధికారి సికె.ఖన్నా సీనియార్టీలో అందరికంటే ముందున్నాడు. అయితే ఆయన ఎంతో ప్రమాదకరమైన వ్యక్తి అని డిడిసిఎకి పరిశీలకుడిగా వ్యవహరించిన రిటైర్డ్ న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. అయినప్పటికీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించనున్న జస్టిస్ ఫాలీ నారిమన్, జస్టిస్ గోపాల్ సుబ్రమణ్యం ముద్గల్ లాంటి న్యాయ కోవిదుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. సికె.ఖన్నాతో పాటు బిసిసిఐలో రెండోసారి ఉపాధ్యక్షుడిగా ఉన్న గౌతమ్ రాయ్ కూడా బోర్డు తాత్కాలిక అధ్యక్ష పదవికి రేసులో ఉన్నాడు. అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ)కి చెందిన ఆయనకు 2000 సంవత్సరం ఆరంభం నుంచి 2015 వరకు ఆ సంఘం అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఆయన హయాంలో అస్సాం క్రికెట్ సంఘంపై ఎంతో అధ్వాన్నంగా తయారైందని ‘డెలాయిట్’ తన అంతర్గత నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఖన్నా, రాయ్‌లకు తమతమ రాష్ట్ర క్రికెట్ సంఘాలతో దశాబ్దాలుగా ఎంతో అనుబంధం ఉన్నప్పటికీ వీరిద్దరూ తప్పనిసరిగా కూలింగ్ ఆఫ్ పిరియడ్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇదేవిధంగా ఆంధ్రా క్రికెట్ సంఘంలో దశాబ్ద కాలం పాటు పదవిని అనుభవించిన మరో ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు కూడా కూలింగ్ ఆఫ్ పిరియడ్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రస్తుతం బిసిసిఐలో ఉపాధ్యక్షుడిగా లేడు. అంతేకాకుండా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సిఎబి) అధ్యక్షుడిగా ఆయన కనీసం మూడేళ్ల పదవీ కాలాన్ని కూడా పూర్తిచేయలేదు. కనుక బిసిసిఐ తాత్కాలిక అధ్యక్ష పదవిని చేపట్టేందుకు గంగూలీ కూడా అర్హుడు కాదు. దీంతో ఈ పదవికి ఎవరిని నామినేట్ చేయాలో అర్థం గాక క్రికెట్ బోర్డు మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో బిసిసిఐ సిఇఓ రాహుల్ జోహ్రి జనరల్ మేనేజర్ ఎంవి.సుధాకర్‌తో కలసి బోర్డు రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించే అవకాశం కనిపిస్తోంది.