క్రీడాభూమి

చాలా బాధాకరమైన రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జనవరి 2: సుప్రీం కోర్టు తాజా తీర్పు పట్ల ప్రముఖ రాజకీయవేత్త, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ విచారాన్ని వ్యక్తం చేశాడు. రాజకీయాల్లో మరాఠా మాంత్రికుడిగా పేరు పొంది బిసిసిఐతో పాటు అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాల్లో ఎన్నో ఏళ్ల పాటు చక్రం తిప్పిన పవార్ (76) గత నెల ఎంసిఎ (ముంబయి క్రికెట్ అసోసియేషన్) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. బిసిసిఐలో గానీ, అనుబంధ క్రికెట్ సంఘాల్లో గానీ 70 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తులెవరూ పదవుల్లో ఉండటానికి వీల్లేదని జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసును సుప్రీం కోర్టు ఆమోదించడంతో ఆయన ఈ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అలాగే బిసిసిఐ ఎన్నికల్లో ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలన్న లోధా కమిటీ సిఫారసు అమలైతే ముంబయి, మహారాష్ట్ర, విదర్భ క్రికెట్ సంఘాలు రొటేషన్ పద్దతిలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి తలెత్తనుండటం కూడా పవార్ విచారానికి మరో కారణం. రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీల్లో రికార్డు స్థాయిలో 41 సార్లు చాంపియన్‌గా నిలవడంతో పాటు దేశానికి ఎంతో మంది అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లను అందించిన ముంబయి క్రికెట్‌కు ఇది అత్యంత బాధాకరమైన రోజని, సుప్రీం కోర్టు నిర్ణయం వలన ముంబయి క్రికెట్ సంఘానికి ఓటు హక్కు దూరమవడం ఎంతో విచారాన్ని కలిగిస్తోందని పవార్ ఆవేదన వ్యక్తం చేశాడు.