క్రీడాభూమి

వరుసగా నాలుగోసారి టైటిల్ వేటలో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిలిగురి, జనవరి 3: శాఫ్ మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో వరుసగా నాలుగోసారి టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్ బుధవారం బంగ్లాదేశ్ జట్టుతో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. సిలిగురిలోని కాంచన్‌జంగా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఇంతకుముందు మూడు ఎడిషన్లలో టైటిళ్లను గెలుచుకుని సత్తా చాటుకున్న భారత జట్టు సోమవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో నేపాల్‌ను ఓడించి మరోసారి టైటిల్‌కు చేరువైన విషయం తెలిసిందే. కాగా, పూర్తి ఏకపక్షంగా జరిగిన మరో సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్ 6-0 గోల్స్ తేడాతో మాల్దీవుల జట్టును మట్టికరిపించి భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ కంటే ఎంతో బలమైనదిగా పేరు పొందిన భారత జట్టు మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ జట్టును తక్కువగా అంచనా వేయరాదని, ప్రత్యర్థుల పట్ల ఏమాత్రం ఉదాసీనతో వ్యవహరించరాదని మన క్రీడాకారిణులను హెచ్చరించినట్లు కోచ్ సాజిద్ దార్ తెలిపాడు. ‘బంగ్లాదేశ్ జట్టును మేము ఎంతగానో గౌరవిస్తాం. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి అయినప్పటికీ ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లలో ఆ జట్టు ఎంతో చక్కగా ఆడింది. కనుక ప్రత్యర్థులను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదు’ అని దార్ స్పష్టం చేశాడు.