క్రీడాభూమి

జాతీయ బాక్సింగ్‌కు ఇద్దరు కోచ్‌లు, 2 శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: భారతీయ బాక్సింగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చీఫ్ కోచ్ పదవికి ఇద్దరిని ఎంపిక చేశారు. ద్రోణాచార్య పురస్కార గ్రహీత ఎస్‌ఆర్ సింగ్, మహిళల సబ్‌జూనియర్ మాజీ కోచ్ శివ్‌సింగ్‌లను పటియాల, ఔరంగాబాద్‌లలో విడివిడిగా నిర్వహించే శిబిరాలకు ఇన్‌చార్జిలుగా నియమించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు పురుషుల చీఫ్ కోచ్‌గా వ్యవహరించిన గురుబక్స్ సింగ్ సంధూ స్థానంలో ఈ ఇద్దరినీ నియమించారు. సంధూకు మహిళల బాక్సింగ్ చీఫ్ కోచ్ బాధ్యతలను అప్పగించారు. పురుష బాక్సర్లకు జాతీయ శిబిరం ఈ నెల 10నుంచి 47 మంది బాక్సర్లతో ఎస్‌ఆర్ సింగ్ పర్యవేక్షణలో పటియాలలో ప్రారంభమవుతుండగా, మిగతా 38 మంది బాక్సర్లు ఔరంగాబాద్ శివ్‌సింగ్ నేతృత్వంలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు కాక జాతీయ యూత్ కోచ్ జి మనోహరన్‌ను ఆ ఇద్దరికీ డిప్యూటీగా నియమించారు. ఈ ముగ్గురిలో ఇద్దరిని ఆ తర్వాత ఫైనలైజ్ చేస్తారు. మనోహరన్ ఔరంగాబాద్ శిబిరంలో భాగంగా ఉంటారు. బాక్సర్లు, కోచ్‌లనుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తాము ఈ నియామకాలు జరిపామని, పెద్ద సంఖ్యలో కోచ్‌లను, అలాగే జాతీయ శిబిరాన్ని విస్తరించాలని తాము భావిస్తున్నామని భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అజయ్ సింగ్ చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే రెండు శిబిరాల్లోని బాక్సర్లు రెగ్యులర్‌గా ఒకరితో మరొకరు తలపడతారని ఆయన చెప్పారు.