క్రీడాభూమి

మహిళా క్రికెట్ జట్టు సారథిగా మిథాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: శ్రీలంక రాజధాని కొలంబోలో వచ్చే నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న ఐసిసి మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో తలపడే 14 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టుకు స్టార్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ సారథ్యం వహించనుంది. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అజేయంగా టైటిల్‌ను నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ జట్టులో ప్రధాన క్రీడాకారిణులైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ టి-20 లీగ్ టోర్నమెంట్‌లో ఆడుతుండటంతో ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనే భారత జట్టు సారథిగా మిథాలీ రాజ్‌ను ఎంపిక చేశారు. భారత మహిళా క్రికెట్ జట్టు ఆడే తదుపరి పెద్ద ఈవెంట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్సే. ఈ పోటీల్లో భారత్‌తో పాటు ఆతిథ్య శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, థాయిలాండ్ జట్లకు గ్రూప్-ఎలోనూ, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా జట్లకు గ్రూప్-బిలోనూ చోటు కల్పించారు. ఈ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు ఫిబ్రవరి 7వ తేదీన శ్రీలంకతో పోరాటాన్ని ఆరంభించడానికి ముందు దక్షిణాఫ్రికా జట్టుతో సన్నాహక మ్యాచ్ ఆడుతుంది.
ఇదీ భారత జట్టు
మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన, తిరుష్ కామిని, వేదా కృష్ణమూర్తి, దేవికా వైద్య, సుష్మా వర్మ (వికెట్‌కీపర్), ఝులన్ గోస్వామి, శిఖా పాండే, సుకన్యా పరీదా, పూనమ్ యాదవ్, ఏక్తా బిస్త్, రాజేశ్వరీ గైక్వాడ్, దీప్తీ శర్మ.

చిత్రం..మిథాలీ రాజ్