క్రీడాభూమి

క్రీడా సంఘాలపై కేసు పెట్టనున్న సౌందరాజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: పదేళ్ల క్రితం దోహాలో జరిగిన ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని సాధించి, ఆ తర్వాత లింగ నిర్ధారణ పరీక్షలో విఫలమైనందుకు ఆ పతకాన్ని కోల్పోయిన మాజీ అథ్లెట్ శాంతి సౌందరాజన్ ఇప్పుడు ఈ వ్యవహారంలో భారత అథ్లెటిక్ సమాఖ్య, భారత ఒలింపిక్ సంఘంతో పాటు అధికారులపై మానవ హక్కుల ఉల్లంఘన కేసు దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. 2006లో ఆసియా క్రీడలు జరిగినప్పుడు 800 మీటర్ల పరుగు పోటీలో సౌందరాజన్ రజత పతకాన్ని సాధించినప్పటికీ లింగ నిర్థారణ పరీక్షలో ఆమె విఫలమవడంతో ఆసియా ఒలింపిక్ మండలి ఆ పతకాన్ని వెనక్కి తీసేసుకుంది. దీంతో ఈ వ్యవహారంపై ఆమె జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు చేసింది. ఈ విషయంపై ప్రస్తుతం ఆమె త్వరలో సుప్రీం కోర్టులో గానీ, లేక మద్రాస్ హైకోర్టులో గానీ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు మదురైలోని సృష్టి ఎన్‌జివో అధిపతి గోపీ శంకర్ తెలిపారు.

చిత్రం..శాంతి సౌందరాజన్