క్రీడాభూమి

వార్నర్ మెరుపు సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 3: పాకిస్తాన్‌తో మంగళవారం సిడ్నీలో ప్రారంభమైన మూడో టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మాథ్యూ రెన్షా పరుగుల వరద పారించారు. పాక్ బౌలర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వార్నర్ కేవలం 78 బంతుల్లోనే అత్యంత వేగవంతంగా శతకాన్ని పూర్తిచేసి అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో 18వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. దీంతో అతను టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు మొదటి సెషన్‌లోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా ఆసీస్ క్రికెట్ లెజెండ్స్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, విక్టర్ ట్రంపర్‌ల సరసన చోటు దక్కించుకోవడంతో పాటు ఆస్ట్రేలియాలో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. టెస్టుల్లో తొలి రోజు మొదటి సెషన్‌లోనే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల ఆస్ట్రేలియా జాబితాలో వార్నర్ కంటే ముందు బ్రాడ్‌మన్, ట్రంపర్, చార్లీ మెకార్టినీ ఉన్నారు. 87 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ 105 పరుగులు, 1902లో మాంచెస్టర్‌లో జరిగిన పోరులో ట్రంపర్ 103 పరుగులు, 1926లో లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో చార్లీ మెకార్టినీ 112 పరుగులు రాబట్టి తొలి సెషన్‌లోనే సెంచరీలు నమోదు చేసుకోగా, ప్రస్తుతం పాక్‌తో జరుగుతున్న పోరులో వార్నర్ 78 బంతుల్లో సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 95 బంతులను ఎదుర్కొన్న వార్నర్ మొత్తం మీద 17 ఫోర్ల సహాయంతో 113 పరుగులు రాబట్టి వహాబ్ రియాజ్ బౌలింగ్‌లో సర్‌ఫ్రాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇవ్వగా, అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఉస్మాన్ ఖ్వాజా (13)తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (24) స్వల్పస్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. అయితే స్థిమితంగా ఆడుతూ పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఓపెనర్ రెన్షా (167) టెస్టు కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హ్యాండ్స్‌కూంబ్ (40)తో కలసి అజేయంగా 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు దీంతో మంగళవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు నష్టపోయి 365 పరుగులు రాబట్టిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.

చిత్రం..78 బంతుల్లోనే సెంచరీ సాధించిన డేవిడ్ వార్నర్