క్రీడాభూమి

పాకిస్తాన్ ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 4: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ ఎదురీదుతున్నది. హ్యాండ్‌కోమ్ సెంచరీతో రాణించడంతో, ఆసీస్ ఎనిమిది వికెట్లకు 538 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, అందుకు సమాధానంగా తొలి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఈ జట్టు ఇంకా 412 పరుగులు వెనుకంజలో ఉండగా, చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. మూడు వికెట్లకు 365 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఉదయం ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా 388 పరుగుల వద్ద మరో సెంచరీ హీరో, ఓపెనర్ మాట్ రెన్షా వికెట్‌ను కోల్పోయింది. అతను 293 బంతులు ఎదుర్కొని, 20 ఫోర్లతో 184 పరుగులు చేశాడు. కార్ట్‌రైట్ 37 పరుగులకు ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌కాగా, హ్యాండ్‌కోమ్ 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. 205 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. మాథ్యూ వేడ్ 27, రెండో రోజు ఆట చివరి బంతికి మిచెల్ స్టార్క్ 16 పరుగులు చేసి అవుటయ్యారు. అతను అవుటైన వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ప్రకటించాడు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను మొలుపెట్టిన పాకిస్తాన్ ఆరు పరుగుల వద్ద షర్జీల్ ఖాన్ (4) రూపంలో మొదటి వికెట్‌ను చేజార్చుకుంది. అదే ఓవర్‌లో బాబర్ ఆజమ్‌ను కూడా జొస్ హాజెల్‌వుడ్ అవుట్ చేశాడు. అయితే, ఆతర్వాత ఓపెనర్ అజర్ అలీతో కలిసిన సీనియర్ ఆటగాడు యూనిస్ ఖాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆట ముగిసే సమయానికి అజర్ 58, యూనిస్ 64 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.