క్రీడాభూమి

శ్రీనివాసన్ మళ్లీ ప్రత్యక్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: అత్యంత అవమానకరమైన రీతిలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన ఎన్. శ్రీనివాసన్ చాలాకాలం తర్వాత మళ్లీ తెరపై ప్రత్యక్షమయ్యాడు. లోధా కమిటీ సిఫార్సుల నేపథ్యంలో, బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలపై సుప్రీం కోర్టు వేటు వేసిన నేపథ్యంలో, శనివారం బెంగళూరులో ఒక అనధికార సమావేశాన్ని శ్రీనివాసన్ ఏర్పాటు చేశాడు. బోర్డులోని ప్రముఖులు చాలా మంది ఈ సమావేశానికి హాజరవుతారని సమాచారం. తాత్కాలిక అధ్యక్ష పదవికి అతను పోటీపడతాడా? లేక భవిష్యత్ వ్యూహాన్ని చర్చించుకోవడానికే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాడా? అన్నది ఇంకా తెలియడం లేదు.

చిత్రం..శ్రీనివాసన్