క్రీడాభూమి

సరైన సమయంలో సరైన నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లో కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న ధోనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు భారత జాతీయ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని ధోనీని ప్రశంసించాడు. ఈ నెల 15 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే వనే్డ సిరీస్‌ను ప్రస్తావిస్తూ, దీని ప్రారంభానికి ముందే ధోనీ తన నిర్ణయాన్ని ప్రకటించడాన్ని అతను సమర్థించాడు. ఆరేడు నెలల క్రితమే కెప్టెన్సీ నుంచి ధోనీ వైదొలగి ఉంటే, భారత క్రికెట్ సమస్యల్లో పడేదని పిటిఐతో మాట్లాడుతూ ఎమ్మెస్కే చెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలను అందించిన విరాట్ కోహ్లీ తనను తాను నిరూపించుకున్నాడని, అతని ఆత్మవిశ్వాసం ఇప్పుడు పెరిగిందని చెప్పాడు. వనే్డ, టి-20 సిరీస్‌ల్లోనూ అతను జట్టును సమర్థంగా నడిపిస్తాడన్న ధీమా వ్యక్తం చేశాడు.
భర్తీ చేయడం కష్టం: జహీర్ అబ్బాస్
కరాచీ: కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు ధోనీ ఎనలేని సేవలు అందించాడని, అతని స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించాడు. మైదానంలో ఎప్పుడూ ఒత్తిడికి గురికాకుండా, జట్టును నడిపించడం అనుకున్నంత సులభం కాదని అన్నాడు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గానూ ధోనీ అసాధారణ ప్రతిభావంతుడని ప్రశంసించాడు. 2005-06 సీజన్‌లో భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించినప్పుడు అతను 46 బంతుల్లో 72 పరుగులు సాధించిన దృశ్యం ఇప్పటికీ తన కళ్ల ముందే కదలాడుతున్నదని జహీర్ అన్నాడు. ఆ ఇన్నింగ్స్‌తో, లాహోర్‌లో ధోనీ స్టార్‌గా ఎదిగిపోయాడని, అప్పటి దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా అతనిని ప్రశంసల్లో ముంచెత్తాడని గుర్తుచేశాడు. అహంకారం లేని సున్నిత మనస్కుడిగా అతనిని జహీర్ అభివర్ణించాడు. ధోనీ స్థాయిలో సేవలు అందించడానికి కోహ్లీకి కొంత సమయం పట్టవచ్చని అన్నాడు. విమర్శలకు, పొగడ్తలకు ఒకే విధంగా స్పందించే ధోనీ నాయకత్వ ప్రతిభను ఈతరం ఆటగాళ్లు అర్థం చేసుకొని, నడవాలని సూచించాడు.

చిత్రం..ఎమ్మెస్కే ప్రసాద్