క్రీడాభూమి

రెన్షాకు గాయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 6: ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ మాట్ రెన్షాకు ఒకదాని తర్వాత మరొకటిగా బలమైన గాయాలు తగులుతున్నాయి. పాకిస్తాన్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మహమ్మద్ ఆమీర్ వేసిన బౌన్సర్ మెరుపు వేగంతో వచ్చి రెన్షా హెల్మెట్‌కు తగిలింది. తలకు గాయం కాకపోయినా, బంతి వేగం దెబ్బకు తలదిమెత్తిపోయింది. బ్యాటింగ్‌లోనేకాదు.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోనూ రెన్షాకు గాయాలు తప్పలేదు. సర్ఫ్‌రాజ్ అహ్మద్ బలంగా కొట్టిన స్వీప్ షాట్ ఫార్వర్డ్ షార్ట్‌లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న రెన్షా హెల్మెట్‌కు తగిలింది. ప్రాథమిక చికిత్స తర్వాత కోలుకొని అతను ఫీల్డింగ్‌ను కొనసాగించాడు. ఒకసారి దెబ్బ తగిలింది కాబట్టి, అతని ఫీల్డింగ్ పొజిషన్‌ను మార్చాలన్న ఆలోచన ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కు రాకపోవడం విచిత్రం. ఫలితంగా రెన్షా మళ్లీ షార్ట్ లెగ్ స్థానంలోనే నిలబడ్డాడు. అదే బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి రెండోసారి అతని హెల్మెట్‌కు తగిలింది. మైదానంలోనే కూలబడిన అతనికి సహాయక బృందం చికిత్సను అందించింది. తేరుకున్నట్టు కనిపించిన రెన్షా కొద్దిసేపు ఫీల్డింగ్ పొజిషన్ తీసుకున్నాడు. కానీ, విపరీతమైన తలనొప్పి రావడంతో అతను మైదానాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. పరీక్షలు జరిపించామని, గాయమేదీ తగల్లేదని ఆస్ట్రేలియా జట్టు డాక్టర్ పీటర్ బ్రక్నర్ ప్రకటించాడు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా అతనికి విశ్రాంతినివ్వాలని కోరామని, అందుకే, చివరి రెండు రోజుల ఆటలో అతను ఫీల్డింగ్ చేయడం లేదని వివరించాడు. కెరీర్‌లో ఆడుతున్న మొదటి సిరీస్‌లోనే రెన్షా ఈ విధంగా దెబ్బలు తగిలించుకోవడం ఆసీస్ క్రికెట్ పెద్దలను ఆందోళనకు గురి చేస్తున్నది. సీన్ అబోట్ వేసిన బౌన్సర్‌కు గాయపడి, మూడు రోజులు మృత్యువుతో పోరాడిన తర్వాత ఫిల్ హ్యూస్ తుది శ్వాస విడిచిన ఉదంతం ఆస్ట్రేలియా అధికారులను ఇప్పటికీ భయపెడుతునే ఉంది. అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) చర్యలను చేపట్టినట్టు సమాచారం.