క్రీడాభూమి

సురేష్ కల్మాడి, అభయ్ చౌతాలా నియామకాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గౌరవాధ్యక్షులుగా సురేశ్ కల్మాడి, అభయ్ చౌతాలా నియామకాలను రద్దు చేసుకుంటున్నట్లు ఐఓఏ ప్రకటించింది. ఈ ఇద్దరికీ ఐఓఏ పదవులు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడం తెలిసిందే. ఈ నియమాకాలు రద్దు చేసుకోకపోతే ఐఓఏ గుర్తింపు రద్దు చేస్తామని క్రీడల మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తూ షోకాజ్ నోటీసు కూడా పంపించింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఐఓఏ వీరి నియామకాలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం తెలిపింది. సాంకేతిక కారణాల కారణంగా కల్మాడి, చౌతాలాలను శాశ్వత అధ్యక్షులుగా నియమించాలన్న నిర్ణయం రద్దు చేసుకున్నట్లు క్రీడల మంత్రిత్వ శాఖ పంపిన షోకాజ్ నోటీసుకు ఇచ్చిన సమాధానంలో ఐఓఏ అధ్యక్షుడు ఎన్ రామచంద్రన్ తెలిపారు. అయితే తాను ఈ లేఖను పూర్తిగా చూడలేదని, టిక్కర్‌ను మాత్రమే చూసానని, ఏదేమైనప్పటికీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని క్రీడల వాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. ఐఓఏ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ఆదనికి తిరిగి గుర్తింపు లభించడానికి మార్గం సుగమం అయినట్లయింది. ఇదొక్కటే కాదు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వీరిని శాశ్వత అధ్యక్షులుగా ఎంపిక చేయడం వల్ల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) ఎలాంటి చర్యా తీసుకోకుండా ఉండడం కోసం ఐఓఏ వీరి నియామకాలను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఫిఫా ప్రపంచ కప్-2026లో 48 జట్లు
జ్యూరిచ్, జనవరి 10: ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో కొత్తగా మరో 16 దేశాలకు చెందిన జట్లను చేర్చి 2026లో మొత్తం 48 జట్లతో పోటీలను నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) ప్రకటించింది. ఈ టోర్నీలో మూడేసి జట్లను 16 గ్రూపుల్లో చేర్చి, తొలి దశ పోటీలు ముగిసే సరికి ఒక్కో గ్రూప్‌లో తొలి రెండు స్థానాలను దక్కించుకున్న జట్లను రౌండ్-32కి పంపాలని ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో చేసిన ప్రతిపాదనను ఫిఫా పాలక మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను మరింత భారీ స్తాయిలో నిర్వహిస్తామని ఎన్నికల సందర్భంగా ఇన్‌ఫాంటినో ఇచ్చిన హామీ నెరవేరడంతో పాటు పెద్ద మొత్తంలో నిధులు సమీకరించి ఫిఫాలోని 211 సభ్య దేశాల జట్లకు తగిన రీతిలో సాయం చేసేందుకు వీలవుతుంది.