క్రీడాభూమి

ఉప్పొంగిన అభిమానం వెల్లువెత్తిన జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 10: సాధారణంగా ప్రధాన పోటీలకు ముందు జరిగే సన్నాహక మ్యాచ్‌లకు, ప్రత్యేకించి పనిదినం నాడు జరిగే సన్నాహక మ్యాచ్‌లకు వీక్షకులు పెద్ద సంఖ్యలో రాకపోవచ్చు. కానీ భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో మంగళవారం ఇక్కడ జరిగిన సన్నాహక మ్యాచ్ మాత్రం ఇందుకు భిన్నమైనది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఖ్యాతి పొందిన మహేంద్ర సింగ్ ధోనీ చివరి సారిగా సారథ్యం వహిస్తున్నది ఇండియా-ఏ జట్టుకే అయినప్పటికీ ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతో తమ ఆరాధ్య ఆటగాడైన ‘కెప్టెన్ కూల్’ ధోనీని చివరిసారి దర్శించుకునేందుకు వీక్షకులు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో దక్షిణ ముంబయిలో ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన బ్రాబోర్న్ స్టేడియం క్రిక్కిరిసిపోయింది.
భారత్‌కు 2007లో ట్వంటీ-20 ప్రపంచ కప్‌ను, ఆ తర్వాత 2011లో వనే్డ ప్రపంచ కప్‌ను అందించిన ‘జార్ఖండ్ డైనమైట్’, రాంచీ సూపర్‌స్టార్ ధోనీ భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టుతో రెండు సన్నాహక మ్యాచ్‌లలో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టుకు సారథ్యం వహించాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి గతంలోనే వైదొలగడంతో పాటు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన ధోనీకి కెప్టెన్‌గా ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌లో ధోనీని వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో బ్రాబోర్న్ స్టేడియంకు తరలి వచ్చారు. దీంతో మధ్యాహ్న సమయానికే స్టేడియం వెలుపల భారీ క్యూలు దర్శనమిచ్చాయి. అనంతరం నిమిషాల వ్యవధిలోనే స్టేడియంలో తొలుత ఈస్ట్ స్టాండ్, నార్త్ స్టాండ్ పూర్తిగా నిండిపోవడంతో ఆ తర్వాత ప్రేక్షకులు వెస్ట్ స్టాండ్‌లోకి ప్రవేశించారు. దీంతో కొద్దిసేపటికే ఆ స్టాండ్ కూడా దాదాపు పూర్తిగా నిండిపోయింది.
తీరా మ్యాచ్ ప్రారంభమై ఇండియా-ఏ జట్టు బ్యాటింగ్‌కు దిగిన కొద్దిసేపటికే ఓపెనర్ మన్‌దీప్ సింగ్ వికెట్‌ను కోల్పోవడంతో అతని స్థానంలో ‘కెప్టెన్ కూల్’ బ్యాటింగ్‌కు దిగుతాడని ఆశించిన ప్రేక్షకులు పెద్ద పెట్టున ‘్ధనీ.. ధోనీ’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఈ నినాదాలతో స్టేడియం మార్మోగిపోయింది. అయితే ఫస్ట్‌డౌన్‌లో ధోనీ కాకుండా అంబటి రాయుడు బ్యాటింగ్‌కు దిగడంతో అభిమానుల ఆశలు తీవ్రంగా నిరాశ చెందారు. అయితే ఆ తర్వాత క్రీజ్‌లో ఏ బ్యాట్స్‌మన్ ఉన్నప్పటికీ ‘కెప్టెన్ కూల్’ నామానే్న జపిస్తూ ‘్ధనీ.. ధోనీ..’ అంటూ నినాదాలను కొనసాగించిన అభిమానులు అతని పట్ల తమకు గల ప్రేమాభిమానాలను మరోసారి చాటుకున్నారు.
ఇప్పటికీ అదే దూకుడు!
ఆ తర్వాత ధోనీ కూడా అభిమానుల ఆశలకు తగ్గట్టే రాణించి వారిని ఎంతగానో అలరించాడు. థర్డ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ‘జార్ఖండ్ డైనమైట్’ తనదైన శైలిలో ప్రత్యర్థులపై తీవ్రస్థాయలో విరుచుకుపడి ఎడాపెడా షాట్లు బాదుతూ మరోసారి పరుగుల వరద పారించాడు. కేవలం 40 బంతులను మాత్రమే ఎదుర్కొన్నప్పటికీ రెండు భారీ సిక్సర్లు, మరో ఎనిమిది ఫోర్ల సహాయంతో అజేయంగా 68 పరుగులు సాధించిన ధోనీ 170 పరుగుల స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం తాను అంతర్జాతీయ కెరీర్ చరమాంకంలో ఉన్నప్పటికీ తన పోరాట పటిమ ఏమాత్రం తగ్గలేదని ధోనీ నిరూపించుకున్నాడు.
ఇదిలావుంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించి దేశంలోని కోట్లాది మంది క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపర్చిన ధోనీ సోమవారం సాయంత్రం తన జట్టులోని సహచర సభ్యులతో కలసి ఇదే స్టేడియంలో కొద్దిసేపు సరదాగా ఫుట్‌బాల్ ఆడుతూ అభిమానులకు కనువిందు చేశాడు.