క్రీడాభూమి

దూకుడు ఆపను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11 టీమిండియా కెప్టెన్ పదవినుంచి వైదొలగాలన్న మహేంద్ర సింగ్ ధోనీ నిర్ణయాన్ని ఆయన వీరాభిమానులు ఇప్పటికీ జీర్ణిచుకోలేక పోయి ఉంటారు. అయితే మంగళవారం రాత్రి ముంబయిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్‌డే వామప్ మ్యాచ్‌లో ధోనీ ఆడిన తీరు చూసిన అభిమానులకు ఓ విధంగా ఆనందానే్న ఇచ్చి ఉంటుంది. మ్యాచ్‌లో ధోనీ తన సహజమైన ఆటతీరుతో అభిమానులను అలరించాడు. కెప్టెన్‌గా ఆ మ్యాచ్ ధోనీకి చివరిదే కావచ్చుగానీ బ్యాట్స్‌మన్‌గా మాత్రం కాదని చాటి చెప్పాడు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో యువరాజ్ సింగ్‌తో జరిపిన వీడియో చాట్‌లో పరిస్థితి అనుకూలిస్తే తాను తన ట్రేడ్‌మార్క్ సిక్స్‌లను బాదడం కొనసాగిస్తూనే ఉంటానని అని చెప్పాడు. యువీ ఈ వీడియోను సోషల్ మీడియాలో ఉంచాడు. కెప్టెన్‌గా మీ ప్రస్థానం ఎలా సాగిందని యువీ ప్రశ్నించగా, ‘కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉంది.. అమోఘంగాను ఉంది. నీ(యువీ)లాంటి ఆటగాళ్లుంటే అది మరీ ఆనందంగా ఉంటుంది. పదేళ్ల పాటు సారథిగా ఎంతో ఆస్వాదించాను. రాబోయే రోజుల్లో మరింత ఆస్వాదిస్తానని ఆశిస్తున్నాను’ అని ధోనీ చెప్పాడు. కాగా, ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ ధోనీని పొగడ్తలతో ముంచెత్తాడు. అత్యుత్తమ కెప్టెన్లలో నీవు ఒకడివని అంటూ, నీ సారథ్యంలో భారత జట్టు మూడు పెద్ద చాంపియన్‌షిప్‌లను, వరల్డ్ కప్‌ను గెలుచుకుందని, ప్రపంచంలో నంబర్ వన్ టెస్టు జట్టుగా అవతరించిందని అన్నాడు. అంతేకాదు, ఇప్పటివరకు తనకు మార్గదర్శకం నిర్వర్తించి, అవకాశాలు ఇచ్చినందుకు ధోనీకి కృతజ్ఞతలు తెలియజేశాడు.