క్రీడాభూమి

రహానే, రైనా ఉన్నప్పటికీ చూపులన్నీ పంత్‌వైపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 11: భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు గురువారం ఇక్కడ ఇండియా-ఏతో రెండవ సన్నాహక మ్యాచ్‌లో ఆడనుంది. పుణెలో ఆదివారం తొలి అంతర్జాతీయ వనే్డతో ప్రారంభమయ్యే ఆరు మ్యాచ్‌ల పరిమిత ఓవర్ల సిరీస్‌లో (మూడు వనే్డలు, మరో మూడు ట్వంటీ-20 మ్యాచ్‌లలో) విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాతో తలపడటానికి ముందు ఇంగ్లాండ్ జట్టు ఆడుతున్న చివరి సన్నాహక మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే గత కొంత కాలం నుంచి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో భారీగా పరుగులు కొల్లగొడుతున్న భారత యువ ఆటగాడు రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు. గత జూనియర్ ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్‌లో కరీబియన్లతో తలపడి రన్నరప్ టైటిల్ గెలుచుకున్న భారత అండర్-19 జట్టులో సభ్యుడైన పంత్ ఇటీవలి కాలంలో జరిగిన మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించి అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుత రంజీ సీజన్ ప్రారంభంలో మహారాష్ట్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారించి దాదాపు ప్రతి బంతికీ ఒక పరుగు చొప్పున 9 సిక్సర్లు, మరో 42 ఫోర్ల సహాయంతో మొత్తం 308 పరుగులు రాబట్టిన పంత్ ఆ తర్వాత జార్ఖండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కూడా మూడంకెల స్కోరుతో మెరిశాడు. దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌లలో తలపడబోతున్న భారత జట్టులో అతనికి చోటు లభించింది.
ధోనీకి వారసుడిగా పరిగణిస్తున్న ఈ పొట్టి వికెట్‌కీపర్ బ్రాబోర్న్ స్టేడియంలో చక్కటి బౌన్స్‌ను కలిగివున్న పిచ్‌పై మరోసారి అదేవిధంగా రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ స్థానం కోసం పంత్‌తో పోటీపడుతున్న జార్ఖండ్ జట్టులోని అతని సహచరుడు ఇషాన్ కిషన్ కూడా ఈ మ్యాచ్‌లో ఆకర్షణగా నిలువనున్నాడు. వరల్డ్ కప్ అండర్-19 జట్టులో సభ్యుడైన ఇషాన్ కిషన్ కూడా పంత్‌కు మాదిరిగానే ఎటాకింగ్ బ్యాట్స్‌మన్ కావడం గమనార్హం. దీంతో సెలెక్టర్లు గురువారం ఇంగ్లాండ్‌తో తలపడే ఇండియా-ఏ జట్టుకు కిషన్‌ను వికెట్‌కీపర్‌గా ప్రకటించారు.
కాగా, గాయాల వలన చాలా కాలం నుంచి ఆటకు దూరమై ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్న ఇండియా-ఏ జట్టు కెప్టెన్ అజింక్యా రహానేకి రిహాబిలిటేషన్ తర్వాత ఇదే తొలి మ్యాచ్. దీంతో అతను వనే్డ సిరీస్ ప్రారంభం కావడానికి ముందే సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా, భారత వనే్డ జట్టులో స్థానాన్ని కోల్పోయి, ట్వంటీ-20 జట్టులో సభ్యుడిగా ఉన్న సీనియర్ ఆటగాడు సురేష్ రైనా కూడా ఈ మ్యాచ్‌లో అందరినీ మెప్పించాలని ఎదురు చూస్తున్నాడు. రైనాతో పాటు మరో అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ షెల్డన్ జాక్సన్, విజయ్ శంకర్, పర్వెజ్ రసూల్, దీపక్ హుడా లాంటి ఆల్‌రౌండర్లు ఉన్న ఇండియా-ఏ జట్టులో బౌలింగ్ విభాగాన్ని ఎడమచేతి వాటం స్పిన్నర్ షాబాజ్ నదీమ్‌తో కలసి సీనియర్ పేసర్లు వినయ్ కుమార్, అశోక్ దిండా, ప్రదీప్ సంగ్వాన్ ముందుకు నడపనున్నారు.
ఇదిలావుంటే, మంగళవారం తొలి సన్నాహక మ్యాచ్‌లో రిజర్వు ఆటగాళ్లుగా ఉన్న ప్రధాన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టో, స్పీడ్‌స్టర్ లియామ్ ప్లంకెట్‌లను గురువారం బరిలోకి దింపాలని ఇంగ్లాండ్ జట్టు యోచిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కీలక బ్యాట్స్‌మన్ జో రూట్ ఆడే అవకాశం కనిపించడం లేదు. గురువారమే ఇంగ్లాండ్ జట్టులో చేరబోతున్న అతను ఆ తర్వాత సహచర సభ్యులతో కలసి టీమిండియాతో మొదటి వనే్డలో తలపడేందుకు పుణె వెళ్లనున్నాడు.