క్రీడాభూమి

అన్ని ఫార్మాట్లలో సారథ్యం గొప్ప గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, జనవరి 11: టీమిండియాకు క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు నాయకత్వం వహిస్తానని తాను ఎప్పుడు అనుకోలేదని, ఇలాంటి రోజు తన జీవితంలో వస్తుందని కూడా తాను ఎప్పుడూ అనుకోలేదని భారత జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితుడైన విరాట్ కోహ్లీ చెప్పాడు. ‘నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను జట్టులోకి వచ్చినప్పుడు చక్కగా రాణించాలని, మరిన్ని అవకావాలు అందిపుచ్చుకుని నిలకడయిన కెరీర్‌ను రూపొందించుకోవడానికి, జట్టు మ్యాచ్‌లు గెలిచేందుకు నా వంతు సేవలు అందించడానికే ప్రయత్నించాను’ అని కోహ్లీ చెప్పాడు. వన్‌డే, ట్వంటీ-20 ఫార్మాట్‌లలో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీనుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో మొన్నటివరకు టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా ఉండిన విరాట్ కోహ్లీని అన్ని ఫార్మాట్‌లలోను కెప్టెన్‌గా గత వారం నియమించడం తెలిసిందే. బుధవారం పుణెలో ఒక మాల్‌ను ప్రారంభించిన తర్వాత కోహ్లీ మందిరాబేడీతో టాక్‌షోలో పాల్గొన్నాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా నియమితుడు కావడంపై మీరు ఎలా ఫీలవుతున్నారని అడగ్గా, తన ప్రయాణం ఇలా మలుపు తిరుగుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని కోహ్లీ చెప్పాడు. జూనియర్ స్థాయిలో ఆతను ఆడిన జట్టుకు కెప్టెన్‌గా ఉండే వాడినని, అయితే టీమిండియాకు కెప్టెన్‌గా ఉండడం దానికి పూర్తి భిన్నమైందని, అది ఒక హాట్‌సీట్‌లాంటిదని అందరి దృష్టి ఉండడంతో పాటుగా పొగడ్తలు, విమర్శలు అన్నిటినీ ఎదుర్కోవవలసి ఉంటుందని కోహ్లీ చెప్పాడు. అయితే ఈ బాధ్యత తాను జీవితంలో ఓ మంచి క్రికెటర్‌గా, వ్యక్తిగా తయారుకావడానికి తోడ్పడుతుందని మాత్రం చెప్పగలనని అన్నాడు. కాగా, భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఒత్తిడిగా భావిస్తున్నారా అని అడగ్గా, ఇది ఒత్తిడితో కూడుకున్న పనని తాను చెప్పలేను కానీ, ఎంజాయ్ చేసేదని అన్నాడు. మీకన్నా సీనియర్లయిన ఆటగాళ్లున్న జట్టుకు కెప్టెన్‌గా ఉండడం కష్టమా అని అడగ్గా, అదొక ‘ప్రివిలేజ్’ అని కోహ్లీ చెప్పాడు. ప్రపంచ కప్‌లో జట్టుకు నాయకత్వం వహించడానికి ఉత్సుకతతో ఉన్నారా అని అడగ్గా, అది ఇంకా చాలా దూరంలో ఉందని కోహ్లీ చెప్పాడు.