క్రీడాభూమి

షకీబ్ డబుల్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జనవరి 13: షకీబ్ అల్ హసన్ డబుల్ సెంచరీతో కదంతొక్కగా, న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ ఏడు వికెట్లకు 542 పరుగుల భారీ స్కోరు సాధించింది. బంగ్లాదేశ్ తరఫున ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా షకీబ్ రికార్డు సృష్టించడం, సెంచరీ హీరో ముష్ఫికర్ రహీంతో కలిసి ఐదో వికెట్‌కు 359 పరుగులు జోడించడం రెండో రోజు ఆట విశేషాలు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆలస్యంగా ప్రారంభమై, నిర్ణీత సమయానికి ముందుగానే ముగిసిన తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ నాలుగు వికెట్లకు 154 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను కొనసాగించి, పరుగుల వరద సృష్టించింది. కివీస్ బౌలింగ్‌ను ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా షకీబ్, ముష్ఫికర్ రహీం పరుగులు కొల్లగొట్టారు. జట్టు స్కోరు 519 పరుగుల వద్ద ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో వాల్టింగ్ క్యాచ్ అందుకోగా ముష్ఫికర్ రహీం అవుట్ కావడంతో న్యూజిలాండ్ ఊపిరి పీల్చుకుంది. 260 బంతులు ఎదుర్కొన్న అతను 23 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 159 పరుగులు సాధించాడు. మరో 17 పరుగుల తర్వాత షకీబ్ కూడా వెనుదిరిగాడు. నీల్ వాగ్నల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేరిన అతను 276 బంతులు ఎదుర్కొని, 31 ఫోర్లతో 217 పరుగులు సాధించాడు. మెహదీ హసన్ మీర్జా పరుగుల ఖాతాను తెరవకుండానే వాగ్నర్ బౌలింగ్‌లో టిమ్ సౌథీకి చిక్కాడు. బంగ్లాదేశ్ ఏడో వికెట్‌ను కోల్పోయే సమయానికి ఆ జట్టు స్కోరు 542 పరుగులు. వెలుతురు సరిగ్గా లేని కారణంగా అదే సమయంలో ఆటను ముగించారు. అప్పటికి సబ్బీర్ రహ్మాన్ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

* ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ జాబితాలో షకీబ్ అల్ హసన్ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఈ మ్యాచ్‌లో అతను 217 పరుగులు చేసి, గతంలో తమీమ్ ఇక్బాల్ (206) పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు. బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్‌లో షకీబ్‌ది మూడో డబుల్ సెంచరీ. అంతకు ముందు తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీం (200) ఈ ఘనతను అందుకున్నారు.
* ముష్ఫికర్ రహీంతో కలిసి షకీబ్ ఐదో వికెట్‌కు 359 పరుగులు జోడించాడు. బంగ్లాదేశ్ టెస్టు చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. రెండేళ్ల క్రితం పాకిస్తాన్‌పై తమీమ్ ఇక్బాల్, ఇమ్రుల్ కయాస్ 312 పరుగులతో నెలకొల్పిన రికార్డును ఈ జోడీ అధిగమించింది.
* బంగ్లాదేశ్ తరఫున మూడో టెస్టు డబుల్ సెంచరీ సాధించే క్రమంలో షకీబ్ తన కెరీర్‌లో 3,000 పరుగుల మైలురాయిని దాటాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 3,146 పరుగులున్నాయి. బంగ్లాదేశ్ క్రికెటర్లలో తమీమ్ ఇక్బాల్ (3,405) మాత్రమే షకీబ్ కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

చిత్రం..షకీబ్