క్రీడాభూమి

వనే్డ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 13: పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియా 92 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఆస్ట్రేలియాను ఓడించేందుకు 269 పరుగులు సాధించాల్సివుండగా, పాకిస్తాన్ 176 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్ చివరి బంతిలో సెంచరీని నమోదు చేయడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 268 పరుగులు చేసింది. వేడ్ 100 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలవగా, గ్లేన్ మాక్స్‌వెల్ 56 బంతుల్లో 60 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ వికెట్ల పతనం కొనసాగింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ అజర్ అలీ (24), మిడిల్ ఆర్డర్‌లో బాబర్ ఆజం (33), ఇమాద్ వసీం (29) కొంత వరకు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.