క్రీడాభూమి

భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా హెచ్‌సిఏ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఉప్పల్, జనవరి 17: వివాదాల నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ ఆదేశాల ప్రకారం హెచ్‌సిఎ ఎన్నికలు జరిగాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో ఉత్కంఠ భరితంగా పోలింగ్ జరిగింది. మొత్తం 216 ఓట్లకు గాను 207 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. రాజీవ్ రెడ్డి విలేకరులకు తెలిపారు. పోలైన బ్యాలెట్ పత్రాల బాక్సులను భద్రత కోసం ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఫలితాలను త్వరలో వెల్లడిస్తామని రాజీవ్‌రెడ్డి వివరించారు.
గెలుపుపై వివేక్ ధీమా
హెచ్‌సిఏ అధ్యక్ష పదవి కోసం రంగంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, మాజీ ఎంపి జి.వివేకానంద (వివేక్) గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఎన్నికల పోలింగ్ అనంతరం కొద్దిసేపు విలేకరులతో మాట్లాడుతూ కోర్టు నియమించిన లోధా కమిటీ ఆదేశాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. గత కమిటీ పదవీ కాలం ముగిసినా తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేసి కమిటీ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. గతంలో కోట్ల నిధులను సమకూర్చి హెచ్‌సిఏ అభివృద్ధికోసం ఎంతో కృషి చేశామని హెచ్‌సిఏ మాజీ చైర్మన్ వినోద్ పేర్కొన్నారు. అధ్యక్ష పదవి పోటీలో నిలబడిన జయసింహ కూడా విజయంపై ఆశాభావంతో ఉన్నారు.

చిత్రం.. రాజీవ్ గాంధీ స్టేడియం వద్ద హెచ్‌సిఎ ఎన్నికల సందడి