క్రీడాభూమి

నాగల్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 17: త్వరలో న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత డేవిస్ కప్ టెన్నిస్ జట్టు నుంచి యువ ఆటగాడు సుమిత్ నాగల్‌కు ఉద్వాసన పలికారు. అతని క్రమశిక్షణా రాహిత్యమే ఇందుకు కారణం. చండీగఢ్‌లో గత ఏడాది జూలైలో కొరియా జట్టుతో తలపడినప్పుడు భారత జట్టులో రిజర్వు సభ్యుడిగా ఉన్న నాగల్ (19) తప్పతాగి ఆ మత్తు దిగక పోవడం వలన ఉదయం పూట ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదు. అలాగే సెప్టెంబర్‌లో భారత జట్టు న్యూఢిల్లీలో స్పెయిన్‌తో న్యూఢిల్లీలో వరల్డ్ గ్రూప్ ప్లేఆఫ్‌లో తలపడినప్పుడు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఆడిన నాగల్ ఐదో మ్యాచ్ నుంచి వైదొలగాలని నిశ్చయించుకుని సమస్యలను కొని తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే నాగల్ ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడిగా ఎదిగినప్పటికీ హోటల్‌లోని బార్‌లో అతను తప్పతాగి ఆ మత్తు దిగక ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాకపోవడం ఎంత మాత్రం క్షమార్హం కాదని, అందుకే అతడిని డేవిస్ కప్ జట్టు నుంచి తొలగించడం జరిగిందని ఎఐటిఎ (అఖిల భారత టెన్నిస్ సంఘం) వర్గాలు తెలిపాయి.

చిత్రం..సుమిత్ నాగల్