క్రీడాభూమి

సిరీస్‌పై కోహ్లీ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్, జనవరి 18: పరమిత ఓవర్ల ఫార్మాట్లకు కూడా రెగ్యులర్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత జరుగుతున్న మొదటి వనే్డ సిరీస్‌ను సొంతం చేసుకోవాలని విరాట్ కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు. మొదటి వనే్డలో ఇంగ్లాండ్ ఏడు వికెట్లకు 350 పరుగులు సాధించినప్పటికీ ఏమాత్రం తడబడకుండా అతను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, మరో సెంచరీ హీరో కేదార్ జాదవ్‌తో కలిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి విషయం తెలిసిందే. ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదించగల బలమైన బ్యాటింగ్ లైనప్ భారత్‌కు ఉందని ఆ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది. బౌలర్లు విఫలమైనప్పటికీ, ఆ లోటును బ్యాట్స్‌మెన్ సమర్థంగా భర్తీ చేయడంతో టీవిండియా విజయం సాధ్యమైంది. భారత్ ఒక లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన మ్యాచ్‌ల్లో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా సచిన్ తెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించి, జట్టులో తనకు ఎంతటి కీలక స్థానం ఉందో చాటిచెప్పాడు. లక్ష్యాలను భారత్ సమర్థంగా చేజ్ చేసిన మ్యాచ్‌ల్లో సచిన్ 16 సెంచరీలు చేస్తే, కోహ్లీ 17 శతకాలు నమోదు చేశాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతను మరోసారి ఇంగ్లాండ్ బౌలర్లపై దాడికి సిద్ధంగా ఉన్నాడు. 350 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు పర్యాయాలు అందుకుంది. వనే్డ చరిత్రలో ఇదొక రికార్డు. ఆ మూడు పర్యాయాలు కోహ్లీ సెంచరీలు చేయడం గమనార్హం.
కోహ్లీ బాధ్యతాయుతమైన ఆటకు జాదవ్ విజృంభణ తోడు కావడంతో ఇంగ్లాండ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వారిని ఏ విధంగా కట్టడి చేయాలో అర్థంగాక తలలు పట్టుకున్నారు. మ్యాచ్‌ని తమ చేతి నుంచి జాదవ్ లాగేసుకున్నాడని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
అచ్చొచ్చిన బారామతి
భారత్‌కు అచ్చొచ్చిన స్టేడియాల్లో బారామతి ఒకటి. ఈ మైదానంలో టీమిండియా ఇప్పటి వరకూ 15 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడింది. వాటిలో 11 మ్యాచ్‌లను గెల్చుకుంది. బారామతి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశాలున్నాయి. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ వైఫల్యాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, స్థూలంగా చూస్తే బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండడం భారత్ జట్టు మనేజ్‌మెంట్‌కు ఊరటనిస్తున్నది. గాయాల నుంచి కోలుకున్న రోహిత్ శర్మ, యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ తుది జట్టులోకి వచ్చేందుకు క్యూలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ధావన్, యువీ తమను తాము నిరూపించుకోలేకపోతే, బెంచ్‌కే పరిమితం కావచ్చు.
బౌలింగ్ విభాగానికి వస్తే, రవిచంద్రన్ అశ్విన్ కూడా మొదటి వనే్డలో రాణించలేదు. 8 ఓవర్లు బౌల్ చేసిన అతను 63 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా అతనికి దక్కలేదు. అయితే, ఏ క్షణంలోనైనా ఫామ్‌లోకి వచ్చే సత్తా అతనికి ఉంది. కాబట్టి, అశ్విన్‌ను పక్కకుపెట్టే సాహసానికి కెప్టెన్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే ఒడికట్టకపోవచ్చు. బ్యాకప్ స్పిన్నర్‌గా అమిత్ మిశ్రా జట్టులో ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం భారత్‌కు లేదు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ ప్రతి సిరీస్‌కూ మెరుగుపడుతున్నది. పేసర్లలో ఉమేష్ యాదవ్ నిరాశపరచినా, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య బాధ్యతాయుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండు వికెట్లు పడగొట్టిన పాండ్య బ్యాటింగ్‌లోనూ రాణించి, అజేయంగా 40 పరుగులు చేయడం గమనార్హం. మొత్తం మీద అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ కంటే పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా గురువారం నాటి మ్యాచ్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది.
మోర్గాన్‌పై ఒత్తిడి
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌పై ఒత్తిడి పెరుగుతున్నది. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయన్న అనుమానంతో అతను బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లలేదు. దీనితో సహచరుల ఫామ్ ఏ విధంగా ఉంది, ఉపఖండంలోని పిచ్‌లపై వారి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి అన్న అంశాలపై అతనికి పూర్తి స్పష్టత లేదు. ఈ విషయం పుణే వనే్డలో కళ్లకు కట్టినట్టు కనిపించింది. బౌలింగ్ కాంబినేషన్స్‌ను సమయానుకూలంగా ఉపయోగించలేకపోయాడు. పార్ట్‌టైమర్లుసహా ఏడుగురితో బౌలింగ్ చేయించినా, ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయాడు. ఒకవైపు భారత్ బ్యాటింగ్ బలం, మరోవైపు తమ బౌలింగ్ వైఫల్యం మోర్గాన్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే 0-1 తేడాతో వెనుకబడిన ఇంగ్లాండ్ రెండో మ్యాచ్‌లోనూ ఓడితే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోతుంది. దీనితో, ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టును గెలిపించి తీరాలన్న బాధ్యత అతనిపై ఒత్తిడిని రెట్టింపు చేస్తున్నది. మొదటి వనే్డలో దొర్లిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడితే, భారత్‌కు ఇంగ్లాండ్ గట్టిపోటీనిచ్చే అవకాశాలున్నాయి.
మ్యాచ్ గురువారం మధ్యాహ్నం
1.30 గంటలకు మొదలవుతుంది.

‘బర్త్‌డే గర్ల్’
కెర్బర్ ముందంజ
మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ ఏంజెలిక్ కెర్బర్ ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా ముందంజ వేసింది. బుధవారం తన 29వ ఏట అడుగుపెట్టిన ఈ ‘బర్త్‌డే గర్ల్’ రెండో రౌండ్‌లో కరీనా వితాట్‌ను 6-2, 6-7, 6-2 తేడాతో ఓడించింది. మొదటి మ్యాచ్‌ని గెలవడానికి మూడు సెట్లు తీసుకున్న కెర్బర్‌కు రెండో రౌండ్‌ను అధిగమించడానికి కూడా మూడు సెట్లు అనివార్యమయ్యాయి. కాగా, ఏడో సీడ్ గార్బినె ముగురుజా కూడా మూడో రౌండ్ చేరింది. రెండో రౌండ్‌లో ఆమె సమంతా క్రాఫోర్డ్‌పై 7-5, 6-4 ఆధిక్యంతో విజయం సాధించింది. ఎనిమిదో సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవా 6-2, 6-1 స్కోరుతో జైమీ ఫోర్లిస్‌ను, 11వ సీడ్ ఎలినా స్టివటోలినా 6-4, 6-1 తేడాతో జూలియా బొసెప్‌ను ఓడించారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ సంపాదించిన ఆష్లే బార్టి 7-5, 6-1 ఆధిక్యంతో షెల్బీ రోజర్స్‌పై గెలుపొందింది. జెలెనా జొకోవిచ్ 6-3, 6-4 తేడాతో జూలియా జార్జెస్‌ను ఓడించింది. యుగెనీ బుచార్డ్ 7-6, 6-2 ఆధిక్యంతో పెంగ్ షుయ్‌పై విజయాన్ని నమోదు చేసి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.